కేబినెట్ భేటీపై గందరగోళంలో చంద్రబాబు..! లేనట్లేనా..?

మంత్రివర్గ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గందరగోళ వైఖరితో ఉన్నారు. భేటీ నిర్వహించి తీరుతానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఎందుకులే అనుకుంటున్నారు. సోమవారం.. కేబినెట్ భేటీకి సీఈసీ నుంచి అనుమతి వస్తుంది. మంగళవారం భేటీ నిర్వహించాలనుకున్నారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఈసీ అనుమతి ఇచ్చినా… మంత్రివర్గ భేటీ మాత్రం ఉండదనే సంకేతాలు పంపుతున్నారు.

తూచ్.. కేబినెట్ భేటీకి టైం లేదు..!

సీఈసీ నుంచి సోమవారం సాయంత్రానికి అనుమతి వచ్చినప్పటికీ, అప్పటికప్పుడు మంత్రులందరికీ సమాచారం ఇవ్వడం ఇబ్బంది అనే సాకు … వెదుక్కుంటున్నారు. అలాగే.. గంటల వ్యవధిలోనే కేబినెట్ సమావేశం ఉంటుందనే సమాచారాన్ని అధికారులకు పంపి.. హడావుడి పెట్టడం ఎందుకన్న ప్రశ్న ప్రభుత్వ వర్గాల్లోఉందట. అందుకే.. మరో తేదీన కేబినెట్ పెడదామా లేక… కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి తగిన ఆదేశాలు ఇస్తే సరిపోతుందా.. అనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారంటున్నారు. మరో తేదీన కేబినెట్ భేటీ నిర్వహించడం అసాధ్యమే. ఎందుకంటే.. కౌంటింగ్‌కు గట్టిగా పది రోజులు కూడా లేదు.

పార్టీ వ్యవహారాల్లో బిజీ.. బిజీ..!

కేబినెట్ భేటీపై పట్టుబట్టిన… చంద్రబాబు.. ఇప్పుడు… పార్టీ వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలో హడావుడిగా ఉన్నారు. 14వ తేదీన కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటి వరకూ ఖరారు చేసిన జాబితాలో కేబినెట్ భేటీ లేదు. పైగా.. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారీ ప్రణాళికలను టీడీపీ ఖరారు చేసింది. ఇందు కోసం రెండు వందల మంది లాయర్లకు.. అమరావతిలో శిక్షణ ఇస్తున్నారు. వీరు నియోజకవర్గాలకు వెళ్లి .. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. పోటీ చేసిన మంత్రులు దీనిని పర్యవేక్షించక తప్పదు. అందుకే వారు కూడా కేబినెట్ భేటీకి హాజరు కావడం కష్టం.

అధికారులను కట్టడి చేయడానికే ప్లాన్ చేశారా..?

తనకు అధికారం ఉందని.. నిరూపించి.. అధికారులను కట్టడి చేయడానికి మాత్రమే.. చంద్రబాబు కేబినెట్ భేటీ గురించి మాట్లాడారన్న ప్రచారం ప్రస్తుతానికి జరుగుతోంది. కేబినెట్ భేటీకి ప్రొసీజన్ ప్రారంభమయిన తర్వాత అప్పటి వరకూ… తలెగరేసిన అధికారులు.. సైలెంట్ అయ్యారు. చివరికి సీఎస్ కూడా.,. ముఖ్యమంత్రే బాస్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబు.. తాను అనుకున్నది జరిగిందని.. ఇప్పుడు కేబినెట్ భేటీ అవసరం లేదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగూ… ఇరవై మూడున అనుకూల ఫలితం వస్తే… తలెగరేసిన అధికారుల జాబితా ఉంది కాబట్టి… దాని ప్రకారం ముందుకెళ్దామనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: నిశ్శ‌బ్దం

తెలుగు360 రేటింగ్ 2/5 పొడుపు క‌థ వేయ‌డంలో కాదు. దాన్ని విప్ప‌డంలో అంత‌కంటే ఎక్కువ మ‌జా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్ల‌ర్...

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

తెలుగు360 రేటింగ్ 2.25/5 క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close