కొత్తపలుకు రివ్యూ : కేసీఆర్‌ను ఉపప్రధానిగా చూడాలనుకుంటున్న చంద్రబాబు..!

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు… రాజకీయ పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదన్న నమ్మకం అన్ని పార్టీల్లోనూ ఉండటంతో… ఎవరికి వారు తామే కీలకం అని నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో… కేసీఆర్ తీరు… మీడియా వర్గాలకు సైతం అంతుబట్టని విధంగా ఉంది. ఆయన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారని… ఒక సారి కాదు.. కాంగ్రెస్ కూటమి వైపు చూస్తున్నారని.. మరో వైపు చెబుతున్నారు. ఈ క్రమంలో.. వారాంతంలో… రాజకీయ పరిస్థితుల్ని తనదైన శైలిలో విశ్లేషించే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ… కేసీఆర్‌కు.. తన ఆర్టికల్ ద్వారా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నాన్ని పరోక్షంగా చేశారు. అందులో.. కాంగ్రెస్ కూటమిలో చేరితే… ఉప ప్రధాని చాన్స్ వచ్చే అవకాశం అనే ఆఫర్ కూడా ఒకటి.

నరేంద్రమోడీని మరోసారి ప్రధాని కానివ్వకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్న చంద్రబాబు.. అందు కోసం తాను త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధమంటున్నారని ఆర్కే చెప్పుకొస్తున్నారు. ” ప్రధానమంత్రి పదవి చేపట్టే అర్హత చంద్రబాబుకు ఉందని శరద్‌పవార్ వంటి నాయకులు వ్యాఖ్యానిస్తున్నా మోదీ వ్యతిరేక పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకురావడానికై అనుసంధానకర్తగా మాత్రమే తాను వ్యవహరిస్తాననీ, ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదనీ చంద్రబాబు ” చెబుతున్నట్లు ఆర్కే సూత్రీకరిస్తున్నారు. కానీ చంద్రబాబుకు ఉన్న ప్లస్ పాయింట్లు .. అంటే సహనం, అందర్నీ కలుపుకు వెళ్లే తత్వం లాంటివి.. ఆయనను ప్రధాని రేసులోనే ఉంచుతున్నాయని.. ఆర్కే చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తనకు ప్రధాని పవి కన్నా… రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే కీలకమని అనుకుటున్నారట.

కేసీఆర్‌కు ఉప ప్రధాని కావాలనే కోరిక ఉందని… ఆర్టికల్‌లో చెప్పిన వేమూరి రాధాకృష్ణ.. ఆ కోరిక తీరే మార్గాన్ని కూడా.. ప్రవచించారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ సహకరిస్తే… కేసీఆర్ ఉపప్రధాని కావొచ్చంటున్నారు. దీనిపై చంద్రబాబుకు ఏ అభ్యంతరం ఉండదంటున్నారు. ఓ రకంగా ఇది రాయబారంగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత .. కేసీఆర్.. ఆశించినట్లుగా.. వైసీపీకి ఎంపీ సీట్లు లేకపోతే… ఆయన కూడా… జగన్ ను పట్టించుకునే పరిస్థితి ఉండదు. అప్పుడు కేసీఆర్ తన వైఖరి మార్చుకుని చంద్రబాబుతో చేతులు కలపడానికి సిద్ధపడే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఉపప్రధాని కావాలన్నది కేసీఆర్ ఆశకాగా, నరేంద్రమోదీని గద్దెదించాలన్నది చంద్రబాబు కోర్కెగా ఉన్నందున ఇరువురు నాయకులు చేతులు కలిపితే వారి కోరికలు నెరవేరే అవకాశముందని ఫార్ములా కూడా చెప్పేశారు. మొత్తానికి చంద్రబాబుకు మాత్రం పదవులపై ఆశ లేదు… ఆయనకు ఏపీలో అభివృద్ధి కావాలి.. కేసీఆర్‌కు మాత్రం ఉప ప్రధాని పదవి కావాలి అన్న ఆరాటం మాత్రమే ఉందన్నట్లుగా ఆర్టికల్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close