జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఒంటరి…!?

తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ రాజకీయ వ్యూహం బెడిసికొట్టిందనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ బీజేపీ గెలుస్తుందన్న ఉద్దేశంతో ఇంత కాలం చేసిన రాజకీయం బెడిసికొట్టే పరిస్థితి వచ్చే సరికి.. ఎటూ కాని పరిస్థితికి వచ్చేసినట్లుగా రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు… బీజేపీ దగ్గర కాదు.. అటు కాంగ్రెస్‌కు దగ్గర కాలేరు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకోవడానికి చిన్నా.. చితకా పార్టీలు కూడా.. దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు.

కాంగ్రెస్‌ మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీల కూటమిలోకి టీఆర్ఎస్..?

కేసీఆర్ పట్టుదలే కానీ..ఫెడరల్ ఫ్రంట్ అనేది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో…అయితే జాతీయ పార్టీల ప్రభుత్వం కానీ.. లేదా.. ఏదో ఓ జాతీయపార్టీ మద్దతిచ్చిన ప్రభుత్వం కానీ ఏర్పడటం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికే..బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ అనధికారికంగా కూటమిగా ఉన్నాయి. కౌంటింగ్ తర్వాత..కాంగ్రెస్‌కు వచ్చే సీట్లను బట్టి…కాంగ్రెస్‌కు మద్దతివ్వాలా.. కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలా అన్నదానిపై..కూటమి పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఎవరూ కేసీఆర్ కొత్తకూటమి పెడతారని..అందులో చేరి కీలక పాత్ర పోషించాలనే ఆలోచన ఎవరూ చేయడం లేదు. ఏపీ నుంచి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే..సానుకూలంగా ఉన్నారు. ఈ కారణాలతో..ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదు కాబట్టి… ఫలితాల తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా…కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వానికి దగ్గరగా ఉండాలి కాబట్టి.. ఏదో ఓ కూటమిలో చేరక తప్పదు.

కాంగ్రెస్‌.. టీఆర్ఎస్‌ను ఆహ్వానిస్తుందా..?

కాంగ్రెస్‌తో కలిసి..సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కర్ణాటక సీఎం కుమారస్వామితో కాంగ్రెస్‌ కూటమిలో చేరేందుకు రాయబారం నడుపుతున్నారని జాతీయ మీడియా చెబుతోంది. టీఆర్ఎస్ తరపున ఢిల్లీలో రాజకీయాలు చక్కబెట్టే.. ఎంపీ వినోద్ కుమార్ కూడా ఆ కోణంలోనే చర్చలు జరుపుతున్నారు. ఈ సారి యునైటెడ్ ఫ్రంట్ తరహా ప్రభుత్వం ఏర్పడుతుందని…కాంగ్రెస్..ప్రాంతీయ పార్టీల కూటమికి తప్పనిసరిగా మద్దతివ్వాల్సిన పరిస్థితి ఉందని… ఆయన అంచనా వేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత… కొంత మంది కాంగ్రెస్ ముఖ్యులతో… ఓ టీఆర్ఎస్ నేత మంతనాలు కూడా ప్రారంభించారని చెప్పుకోవడం ప్రారంభించారు. కానీ కాంగ్రెస్‌.. టీఆర్ఎస్‌ను అంత మనస్ఫూర్తిగా అహ్వానిస్తుందా అంటే .. చెప్పలేము. టీఆర్ఎస్‌కు ఉండే ఎంపీ సీట్లు ..కచ్చితంగా కాంగ్రెస్‌కు అవసరం అయితే.. ఇప్పుడు ప్రచారంలో ఉన్న పరిణామం జరిగుతుంది.

టీఆర్ఎస్ ఎంపీలు ఎవరికీ అవసరం లేకపోతే.. ఒంటరే..!

మరో వైపు.. కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కేసీఆర్ చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంతో.. బీజేపీ వర్గాలు కూడా గుర్రుగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్… కాంగ్రెస్ పార్టీ కూటమిలో కానీ..కాంగ్రెస్ పార్టీ అనుకూల ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరడం కానీ.. అంత సులువు కాదు. టీఆర్ఎస్‌కు వచ్చిన సీట్లు నిర్ణయాత్మకమైనప్పుడు మాత్రమే… అలాంటి చాన్స్ వస్తుందని… ఢిల్లీ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏం జరిగినా.. అది కౌంటింగ్ తర్వాతేననేది.. టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్న మాట..! . టీఆర్ఎస్ సీట్లు ఎవరికీ అవసరం లేకపోతే.. ఎవరూ పట్టించుకోరు. కేసీఆర్ రాజకీయం.. అంత క్లిష్టంగా ఉంది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close