చంద్రబాబు ఫెయిల్యూర్..! ఆ పార్టీలది వేరే దారి..!

ప్రధానిగా నరేంద్రమోడీని మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని కానివ్వకూడదన్న లక్ష్యంతో ఉన్న… ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేశం మొత్తం తిరిగి… ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా.. తాము అంతా పోరాడుతున్నామన్న భావనను కల్పించడానికి.. ప్రయత్నించారు. కానీ… ఎన్నికల ప్రక్రియ చివరికి వచ్చి.. అందరూ ఒక తాటిపై నిలబడాల్సిన సమయంలో మాత్రం.. ఎవరికి వారే అవుతున్నారు.

విపక్షాల భేటీకి కీలక పార్టీలు రానట్లే..!

ఫలితాలు వచ్చే మే 23వ తేదీన.. బీజేపీయేతర పార్టీలన్నింటితో కలిపి ఓ సమావేశం పెడదామని.. దాని ద్వారా బీజేపీకి ప్రత్యామ్నాయం.. ఉందన్న విషయం .. అటు ప్రజలకు.. ఇటు రాష్ట్రపతికి కూడా సందేశం పంపినట్లు అవుతుందని.. చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ… ఈ భేటీకి… మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ, అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఆసక్తి చూపించలేదు. నిజానికి ఈ మూడు పార్టీలకు కలిపి… 90 వరకూ.. లోక్‌సభ సీట్లు వస్తాయన్న అంచనా ఉంది. ఈ మూడు పార్టీలు.. విపక్ష పార్టీల భేటీకి వస్తే… మోడీకి ప్రత్యామ్నాయం తయారయినట్లే. కానీ… వీరు మాత్రం… ఎన్నికలు చివరికి వచ్చే సరికి.. మోడీకి వ్యతిరేకత కన్నా.. తమకేంటి.. అనుకునే రాజకీయంలోకి పడిపోయారు.

ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే వస్తారా..?

బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమలూ అధినేత్రి మమతా బెనర్జీ.. ప్రధానమంత్రి పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. విపక్షాల భేటీకి వస్తే.. కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు అవుతుందని వారు అనుకుంటున్నారు. తామే ప్రధాని కావాలన్నది వారి లక్ష్యం. ఈ విషయంలో వీరిద్దరూ ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. తమకు వచ్చే సీట్లే నిర్ణయాత్మకం అవుతాయన్నది అంచనా. అందుకే.. ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రమే కూటమి భేటీకి రావాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో… తృణమూల్ కోసం రెండు రోజుల పాటు ప్రచారం చేయడానికి బెంగాల్ వెళ్లిన సీఎం.. మమతా బెనర్జీని ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని తెలుస్తోంది. ఆమె ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తారని.. బహిరంగసభలో చెప్పినా.. తృణమూల్ నుంచి భేటీకి సానుకూలత రాలేదని సమాచారం. దీంతో… మే 23న ఏర్పాటు చేయాలనుకున్న విపక్ష పార్టీల భేటీ కూడా ప్రశ్నార్థకంగా మారింది.

కూటమిలో నేతల మధ్య పోటీనే మోడీకి వరం..!

తనకు ప్రధానమంత్రి పదవి రాకపోతే… మోడీ మళ్లీ ప్రధాని అయినా.. పర్వాలేదన్నట్లుగా… ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యవహరించడం రాజకీయాల్లో వచ్చిన అనూహ్యమైన మార్పుగా చెప్పుకోవచ్చు. ఇది ఓ రకంగా బీజేపీకి కలసి వస్తున్న కాలం. బీజేపీకి పూర్తి మెజార్టీ సాధించకపోవచ్చు కానీ… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాలు… బలంగా ఉండటానికి ఈ ప్రాంతీయ పార్టీల వైఖరే ప్రధాన కారణం. సమైక్యంగా మోడీని ఎదుర్కోలేకపోయిన విపక్షాలు… ఎన్నికల ఫలితాల తర్వాతైనా.. సొంత లాభాన్ని కొంత మానుకుని… దేశం కోసం రాజకీయం చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close