లైట్ తీస్కో : బీకాం ఫిజిక్స్‌లో రాడార్ సైన్స్..! ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా..!

ఆ రోజు అర్థరాత్రి…! అదో పెద్ద కార్యాలయం.. చాలా కామ్‌గా ఉంది..! ఎంత కామ్‌గా అంటే… ” సైలెన్స్ ” కూడా ఎంత వయోలెంట్‌గా ఉంటుందో.. నిరూపించేంత కామ్‌గా ఉంది. అంతటి సైలెన్స్‌లో… ఒకే ఒక్క వ్యక్తి… తన ఎదుట ఉన్న కంప్యూటర్‌ వైపు తీక్షణంగా చూస్తున్నారు. ఆయన ఉత్కంఠగా ఉన్నారు. ఆది సిట్యూయేషన్‌ను మరింత .. వయోలెంట్‌గా మారుస్తోంది. ఎందుకంటే… ఆయన కంప్యూటర్‌లో మేఘాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి మెల్లగా కదులుతున్నాయి. కానీ.. ఆ మేఘాల వెనుక.. ఆయన కావాల్సింది ఉంది. ఆయన కోరుకుంటున్నది ఉంది. ఆయన పంపమని చెప్పినవి ఉన్నాయి. అవి ఆయనకు విమానాలుగా తెలుసు. అయితే.. ప్రయాణికులను దింపి వచ్చే విమానాలు కాదు… ప్రత్యర్థులను చంపేసే విమానాలు. అవి ఆ మేఘాల వెనుక ఉన్నాయి. మేఘాల కారణంగా… కంప్యూటర్‌లో కనిపించడం లేదు. ఒక్క మేఘాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ మేఘాల వేనుక విమానాలు ఉన్నాయో లేదోనన్న టెన్షన్. కాసేపటికి పక్కనున్న ఫోన్ మోగింది. విమానాలు వచ్చేశాయి…అని సారాంశం. ఇది విని “క్లౌడ్ నైన్‌” ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు.

ప్రత్యర్థుల్ని మట్టుబెట్టే ఆ విమానాలు వెళ్లాయి.. వచ్చాయి. ఎవరికీ కనిపించలేదు. అప్పుడెప్పుడో.. అబొట్టాబాద్ అనే పాకిస్థాన్ ఊళ్లో… తలదాచుకున్న లాడెన్‌ను.. చంపుతూంటే… అమెరికాలో కూర్చుని ఒబామా లైవ్‌లో చూసినట్లుగా… టీవీల్లో చూపించారు. అట్లానే చూద్దామనకుంటే.. ఆ మేఘాలు అడ్డొచ్చాయి. లేకపోతే… అవెంజర్స్ సినిమా రేంజ్‌లో.. వాటిని కూడా… ఎన్నికల సమయంలో.. కాసిన్ని… గ్రాఫిక్స్ మిక్స్ చేసి రిలీజ్ చేసి ఉంటే.. ఇండియన్ అవెంజర్స్.. ది ఓపెనింగ్ క్లౌడ్స్ పేరుతో… బిగ్ రియాలిటీ షో అయి ఉండేది. కానీ క్లౌడ్స్ అడ్డం పడ్డాయి. కానీ అప్పుడు ఆ క్లౌడ్ లేకపోతే.. ఇప్పుడీ “క్లౌడ్ నైన్” లేకపోయి ఉండేది.

అలా ఎలా అంటారా… అ క్లౌడ్స్ వల్లే.. కంప్యూటర్లో … ప్రత్యర్థులపై బాంబులేయడానికి బయలుదేరిన విమానాలు కనిపించలేదు కదా..! ఇక్కడ మనకు కనిపించలేదంటే.. అక్కడ ప్రత్యర్థులకు కూడా కనిపించవనే లాజిక్.. ఎవరైనా ఎలా మిస్సవుతారు…?. ఒక మిస్సయితే.. ఆయన పెద్దాయన ఎందుకవుతారు. ఆ మేఘాల చాటున దాక్కున్న యుద్ధవిమానాల జాడ … పత్యర్థులు కూడా కనిపెట్టలేకపోవడంతో… అవి స్మూత్‌గా పని చేసుకొచ్చాయి. అందుకే.. క్లౌడ్ కి ఎంతో జాతీయత ఉందని.. చెప్పుకుని ఒప్పుకుని తీరాల్సిందే. లేకపోతే యాంటీ నేషనలిస్ట్ లే..!

ఇంతకీ క్లౌడ్‌ మ్యాటర్‌ను… ఔపాసన పట్టిన చదువు ఏది..? అహ్మదాబాద్‌లో చదవిన బీకాం డిగ్రీలో ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌లోనిదా..?. లేక… గౌరవ సూచికంగా యేల్ యూనివర్శిటీ ఇచ్చిన డాక్టరేట్‌తో వచ్చిన పరిజ్ఞానమా..?. ఏదైనా మొత్తానికి క్లౌడ్‌కి ఎక్కడ లేని జాతీయ మన దేశంలోనే వచ్చిపడింది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా ఓన్లీ…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close