అయినా ఎల్వీకి తప్పలేదు..! సీఎంతో గంట భేటీ..!

ఎన్నికల కమిషన్ .. ద్వారా ఏపీకి చీఫ్ సెక్రటరీగా నియమితులైన తర్వాత ఎల్వీ సుబ్రహ్మణ్యం మొదటి సారి… ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉదయం పదిన్నర సమయంలో… ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన ఎల్వీ.. దాదాపుగా గంట పాటు.. వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ముఖ్యంగా కేబినెట్ భేటీ ఎజెండాను వివరించినట్లు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే… ఈసీ నుంచి ఇప్పటి వరకు కేబినెట్ భేటీ నిర్వహణకు అనుమతి రాలేదు. ద్వివేదీ ద్వారా… కేబినెట్ భేటీ ఎజెండాను.. సీఈసీకి పంపారు. అనుమతి వచ్చిన తర్వాత కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం నుంచి కేబినెట్ భేటీ నిర్వహణ కోసం అందిన విజ్ఞప్తిపై రెండు రోజుల్లో ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ రెండు రోజుల గడువు ఈ సాయంత్రంతో ముగుస్తుంది. ఈ లోపు ఏదో ఓ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.

అయితే.. కేబినెట్ భేటీకి ఎజెండా ఖరారు కావడంతో.. సీఎస్.. ముఖ్యమంత్రిని కలిసి… ఎజెండాను వివరించక తప్పలేదు. .. కొన్నాళ్లుగా తాను చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో.. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ముఖ్యమంత్రితో భేటీని అనిజీగా భావించినట్లు తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రిని కలవడం ఏమిటన్న పద్దతిలో ఆయన నెల రోజులుగా ఉన్నారు. స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ… ఎన్నికల కోడ్ ఉన్నందున… ముఖ్యమంత్రి కన్నా.. సీఎస్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయన్నట్లుగా వ్యవహరించారు. నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిపై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తనను ముఖ్యమంత్రి కూడా సమీక్షలకు పిలవలేదని చెప్పుకొచ్చారు. ఓ సారి పిలిస్తే.. అర్జంట్ పనిలో ఉండి వెళ్లలేదన్నారు. ఇప్పుడు… మాత్రం పిలవకపోయినా వెళ్లక తప్పలేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుబట్టి కేబినెట్ భేటీ పెట్టాలనుకోవడానికి కారణం .. ఎల్వీ లాంటి అధికారులకు.. తన పవర్ చూపించాలనే పట్టుదలేనని చెబుతున్నారు. కోడ్ పేరుతో… తనను ధిక్కరించేలా వ్యవహరించిన అధికారులకు.. కోడ్ ఉన్నప్పుడే బుద్ది వచ్చేలా చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పట్టుదలగా.. కేబినెట్ భేటీని ఏర్పాటు చేశారంటున్నారు. బిజినెస్ రూల్స్ అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకునేలా.. కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. అందుకే సీఎస్ కూడా.. కచ్చితమైన ఎజెండాకే పరిమితం కావాలన్న ఉద్దేశంతో.. కొన్ని అంశాలను మాత్రమే ఈసీ ఖరారు చేసేలా వ్యవహరించారు. ఇప్పుడు.. కేబినెట్ భేటీ కుదరకపోతే.. ఆ అంశాలపై.. చంద్రబాబు అధికారులతో సమీక్షించి.. విడిగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. దీనికి కూడా సీఎస్ హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close