సూపర్ సిక్స్ పథకాలు స్మూత్‌గా నడిచిపోతున్నాయి. అదే సమయంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇలా అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో నడుస్తూ రాష్ట్రం బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తోంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వ్యవస్థ ద్వారా రైతులు, మహిళలు, వృద్ధులు, పేదలకు ఎప్పటికప్పుడు డబ్బులు అందేలా చేస్తున్నారు. అదే సమయంలో అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, రోడ్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడి వ్యయాన్ని చేస్తున్నారు.
పథకాల అమల్లో జోరు
ప్రజలకు ప్రభుత్వం నేరుగా డబ్బులు అందించే పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. ‘అన్నదాత సుఖీభవ’, ‘తల్లికి వందనం’, ‘దీపం’ వంటి స్కీమ్‌ల డబ్బులు నేరుగా ప్రజ లఖాతాల్లో జమ అవుతున్నాయి. 2025 ఆగస్టు 2న ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన ‘అన్నదాత సుఖీభవ’ స్కీమ్ కింద 46.8 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,000 మొత్తం డైరెక్ట్‌గా జమ అయ్యాయి. మూడు నెలలు తిరిగే సరికి మరో ఏడు వేలు జమ చేశారు. ఇక ‘తల్లికి వందనం’ స్కీమ్ కింద 60 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున జమ చేశారు. ‘దీపం’ స్కీమ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ల నిధులు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం, విద్యుత్ సబ్సిడీలు ఇలా అన్నీ అమలు చేస్తోంది. ఇది పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఇక పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు వంటివి అద్భుతంగా నడుస్తున్నాయి. ఉచిత బస్సు వంటివి మహిళలకు ఎంతో మేలు చేస్తున్నాయి.
జోరుగా అభివృద్ధి పనులు కూడా !
అభివృద్ధి పనులపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన దృష్టి మరింత ఆకర్షణీయంగా ఉంది. 2025లో అమరావతి CRDAలో రూ.45,000 కోట్లకు పైగా ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పనులు పరుులు పెట్టిస్తున్నారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడం, NREGA పనులు పూర్తి చేసి గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి జోరుగా పనులు సాగుతున్నాయి. ఐదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన మౌలిక సదుపాయాల పనులు జోరుగా సాగుతున్నాయి. ఇది పెట్టుబడి వ్యయం. ప్రభుత్వం పది వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో మూడు వేల కోట్లు పన్నుల ద్వారా ఏపీకే వస్తాయి. అలాగే.. పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. పెట్టుబడి వ్యయం ఎంత ఎక్కువ చేస్తే.. ప్రభుత్వాలకు అంత వెసులుబాటు వస్తుంది. చంద్రబాబు ఈ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తున్నారు.
సంక్షేమం – అభివృద్ధి సమ్మిళితం
అటు పనులు సాగడం..ఇటు సంక్షేమం కూడా లోటు లేకపోవడంతో ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు ఎప్పుడూ లేనంత మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. ఇదే చంద్రబాబు మార్క్‌గా రాష్ట్ర ప్రజల్లో మార్గదర్శకత్వం వ్యక్తమవుతోంది. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రూ.8 లక్షల కోట్ల GSDP వైపు మళ్లించడానికి చంద్రబాబు నాయుడు చేపట్టిన చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇది ఏపీ బంగారు భవిష్యత్‌కు సూచికగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడి నాయకత్వం.. ఏపీకి ఎంత మేలు చేస్తుందో కళ్ల ముందు కనిపిస్తోంది.

