‘చిరంజీవి దోశె’కు పేటెంట్ తీసుకుంటున్న చరణ్

హైదరాబాద్: చిరంజీవి స్వయంగా రెసిపీ కనుగొని ఆవిష్కరించిన స్పెషల్ దోశె హైదరాబాద్‌లో కొన్ని హోటళ్ళలోకూడా అదే పేరుతో వడ్డించబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాంచరణ్ ఆ దోశెకు పేటెంట్ హక్కులు తీసుకోబోతున్నారట. ఇప్పటికే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చరణ్ ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పేటెంట్ హక్కులను తన తండ్రి 60వ జన్మదిన కానుకగా ఇస్తానని అన్నారు.

సాధారణంగా దేశె అంటే పలచగా ఉంటుంది. కానీ ఏమాత్రం నూనె వాడకుండా మందంగా చిరంజీవి దోశెను తయారు చేస్తారు. దీనిలో నంచుకోటానికి కూరగాయలతో చేసిన కూటును, వేరుశెనగపప్పుల పచ్చడిని పెడతారు. 25 ఏళ్ళక్రితం ఒకసారి మైసూర్‌కు షూటింగ్‌కు వెళ్ళినపుడు కాఫీ తాగటానికి ఒక చిన్న ఢాబా దగ్గర చిరంజీవి ఆగారట. అక్కడ 2-3 టేబుల్స్ మాత్రమే ఉన్నాయట. అక్కడ వడ్డిస్తున్న ఒక దోశను చిరంజీవి రుచి చూశారట. అది అద్భుతంగా అనిపించిందట. ఎలా తయారుచేస్తారని అడగగా, ఆ ఢాబా నడిపే వ్యక్తి – ఎన్నికావాలంటే అన్నిదోశెలు ప్యాక్ చేసి ఇస్తానుగానీ రెసిపీ చెప్పనని చెప్పాడట. దీంతో చిరంజీవి తన ఇంట్లోని వంటమనిషిని మైసూర్ పిలిచి ఆ దోశె రుచి చూసి రెసిపీ కనుక్కోమని ఆదేశించారట. దాదాపు ఒక సంవత్సరంపాటు ఆ దోశె తయారుచేయటానికి చిరంజీవి ఇంట్లో ప్రయోగాలు చేసినా ఉపయోగం లేకపోయిందట. అయితే ఈ క్రమంలో ఒక రుచికరమైన కొత్త దోశెను కనుక్కొన్నారట. అదే చిరంజీవి దోశె.

చిరంజీవి ఇంటికి వచ్చిన రజనీకాంత్, సచిన్, రిచర్డ్ గేర్‌వంటి ప్రముఖ అతిథులకు ఈ దోశె అంటే ఎంతో ఇష్టమట. మొన్న పార్క్ హయత్ హోటల్‌లో ఈ దోశెనుకూడా అతిథులకు వడ్డించారు. తెలుగు రాష్ట్రాలలో ఈ దోశెను వాణిజ్యపరంగా అమ్మటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చరణ్ చెప్పారు. దీనిని తక్కువ ధరకే అందిస్తానని, తద్వారా ఎక్కువమంది తినటానికి వీలవుతుందని చరణ్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం!

ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు...

జయభేరీది కార్ సర్వీసింగ్ సెంటర్ !

జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే...

దివ్వెలకు ఇల్లు రాసిచ్చేసిన దువ్వాడ !

దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close