లిక్కర్ స్కాంలో జైలుకెళ్లి .. డ్రామాలకు రిహార్సల్స్ చేస్తున్న చెవిరెడ్డి తన లీగల్ ములాఖత్లలో విచిత్రమైన కుట్రలు చేస్తున్నారు. అయితే అవన్నీ రివర్స్ లో తన నెత్తికే చుట్టుకుంటున్నాయని మాత్రం ఆయన ఊహించలేకపోతున్నారు. లిక్కర్ లో తన జైలు గురించి..కేసు గురించి రోజుకే పిటిషన్ వేసేలా లాయర్ల టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా దిండు, దుప్పటి, ఫ్యాన్ ఇప్పించేలా పిటిషన్ వేసి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన మరో పిటిషన్ వేశారు అదేమిటంటే అప్రూవర్లుగా మారిన అధికారులు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని.
సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి కూడా జైలు పాలు కావాలని లక్ష్యం
లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎకరాలుగా వాడుకున్నది సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిలనే. రైల్వే సర్వీసులో పని చేసుకునే వాసుదేవరెడ్డిని తెచ్చి సీట్లో కూర్చోబెట్టి మొత్తం కథ నడుపుకున్నారు. అంతా బయటపడేసరి మాకు ఈ గతి ఎందుకు అని వారు అంతా చెప్పాల్సింది చెప్పేశారు. అప్రూవర్లుగా మారుతాం.. జైల్లో పెట్టవద్దని డీల్ చేసుకున్నారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో ఉంది. అప్రూవర్లుగా మారుతున్నాం కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. కానీ కింది కోర్టు నిరాకరించింది హైకోర్టుకు వచ్చారు. వారికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని చెవిరెడ్డి కౌంటర్ పిటిషన్ వేశారు.
చెవిరెడ్డి తనను తాను బలంగా ఇరికించుకుంటున్నారు !
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ కు బెయిల్ ఇవ్వొద్దని చెవిరెడ్డి దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన స్కాం జరిగింది .. అందులో వారు కూడా భాగమని చెవిరెడ్డి లాయర్లు వాదిస్తే.. ఇక చెవిరెడ్డి .. లిక్కర్ స్కాం విషయంలో చేస్తున్న డ్రామాలు, వేస్తున్న ఒట్లు అన్నీ తేలిపోతాయి. స్కామ్ జరిగింది అందులో చెవిరెడ్డి భాగస్వామి అని ఆయన స్వయంగా అంగీకరించినట్లు అవుతుంది. స్కామ్ జరగలేదు కానీ వారు అప్రూవర్లుగా మారారు అని వాదించాలి. అలా స్కామ్ జరగలేదని అన్నారు అంటే.. ఇక వాళ్లను ఎందుకు జైలుకు పంపాలన్న ప్రశ్న వస్తుంది. రెండు విధాలుగా ఇరుక్కుపోతారు.
వాసుదేవరెడ్డి,సత్యప్రసాద్లకు మరో దారి లేదు!
పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్నంతా చెవిరెడ్డి అరగ దీస్తున్నారు. ఆయన పిటిషన్ వేయని అంశం లేదు. కోర్టుకు తీసుకు వస్తే చేయని నచ్చలేదు. ఆయన ఓవరాక్షనే ఆయనను ఇంకా జైల్లో ఉంచుతోందని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు కౌంటర్ పిటిషన్లు వేస్తున్నారు. తమను అడ్డగోలుగా వాడుకుని స్కామ్ చేయడమే కాకుండా.. తమను జైలుకు కూడా పంపించాలనుకుంటున్నారని వారు మరితం పట్టుదలగా దాచిపెట్టుకున్న వివరాలు కూడా సిట్ కు ఇస్తే.. ఇంకా కూరుకుపోతారు.