జులాయి సినిమాలో బ్రహ్మీని ఎంఎస్ నారాయణ తీసుకొచ్చి సెల్లో పడేస్తాడు. అప్పుడు బ్రహ్మి తనకు పెన్నులు కావాలంటాడు. ఎందుకంటే జీవితచరిత్ర రాసుకుంటానంటాడు. తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇలా జరుగుతుందో లేదో తెలియదు కానీ.. లిక్కర్ కేసులో జైల్లో ఉన్న చెవిరెడ్డి ఇలాంటి కోరికలే కోరుతున్నారు. తనకు ఇంటిభోజనం వచ్చేలా అనుమతి ఇవ్వాలని అలాగే .. ఓ టేబుల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ వేశారు. అలాగే వారానికి మూడు సార్లు లాయర్లు, కుటుంబసభ్యులతో ములాఖత్ కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరపనుంది. ఇంటి భోజనం తెప్పించుకుని టేబుల్ పై పెట్టుకుని తింటారా లేకపోతే.. టేబుల్ తో ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా అన్నది ఆయనకే తెలియాలి. నిజానికి చెవిరెడ్డి బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. చివరికి బెయిల్ రాకపోతే పోయింది ఆస్పత్రికైనా పోదామని చాలా ప్లాన్లు వేశారు. ఏదీ వర్కవుట్ కాలేదు. మంతెన ఆశ్రమంలో సుఖవంతమైన జీవితం కోసం ప్రయత్నించారు. కానీ కుదరలేదు.
ఇప్పుడు అన్నీ వదిలేసి.. ఏదైనా కాస్త్ సుఖపడే సౌకర్యాలు జైల్లోనే పొందితే మంచిదని అనుకుని పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.ఆయన తనకు అన్నిరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. సీఐడీ అభ్యంతరం చెప్పకపోతే.. కోర్టు సౌకర్యాలు .. ఇంటి భోజనం.. టేబుల్ కల్పించవచ్చు. కానీ ములాఖత్‌లో విషయంలో మాత్రం సీఐడీ రూల్స్ ను చూపించే అవకాశం ఉంది.