లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న చెవిరెడ్డికిఇప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల లెక్కకూడా చెప్పాల్సిన పరిస్థితి ఎదురొస్తోంది. తుడా నిధులను ఇష్టం వచ్చిటన్లుగా సొంతానికి వాడుకున్నట్లుగా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొలిటికల్ సర్వే కోసం తుడా డబ్బును వాడినట్లుగా గుర్తించారు. 2025లో విజిలెన్స్ అధికారుల విచారణలో అన్నీ బయటపడినట్లుగా తెలుస్తోంది.
TUDA నిధులలో 90 శాతం చంద్రగిరి నియోజకవర్గంలోని పనులకు మళ్లించారు. ఇలా చేయడం నేరం. చెవిరెడ్డి సొంత ఊరు అయిన తుమ్మలగుంట ట్యాంక్ ఆధునీకరణ అని చెప్పి కోట్లు కొట్టేశారు. ప్రజా ధనంతో బెంచీలను ఏర్పాటు చేసి, వాటిపై తమ పేర్లు రాసుకున్నారు. తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు వ్యక్తిగత పర్యటనలకు కూడా తుడా డబ్బులే ఖర్చు పెట్టారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అనధికారంగా పనులు , బడ్జెట్ కేటాయించినట్లు చూపించారు. ఆ నిధులను ప్రజా నిధులను వ్యక్తిగత ఖాతాలలో జమ చేశారు.
చెవిరెడ్డి కుటుంబానికి చెందిన CMR అనే కంపెనీనే అన్ని కాంట్రాక్టు పనులు చేపట్ిటంది. మొత్తంగా చెవిరెడ్డి కుటుంబం TUDA నుండి రూ. 440 కోట్లను దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ తేల్చింది. అయితే చైర్మన్కు సంతకం చేసే అధికారం లేదని తనకేం తెలియదని అంంటున్నారు. తను చెప్పినట్లుగా చేసిన అధికారుల్ని బలి చేయాలనుకుంటున్నారు. కానీ అసలు డబ్బులు ఆయన ఖాతాలోకే వెళ్లినట్లుగా తేలింది కాబట్టి ఆయన తప్పించుకోలేరని అంటున్నారు.