సిఎంల షోలు సో.. సో..

Telakapalli-Raviజిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రవేశం ఎలాటి ప్రకంపనలు పుట్టించలేదు. ఇద్దరు కూడా జాగ్రత్తగా మాట్లాడతారనేది వూహించిన విషయమే . కాని వాస్తవంలో వారు ఇంకా నిగ్రహంగానే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు విస్త్రతంగా ప్రచారంలో పాల్గొనబోరని ఒక దశలో కథనాలు వచ్చాయి. నిజంగా అదే జరిగితే తమ పార్టీ ప్రతిష్టతో పాటు తన రాజకీయ వ్యక్తిత్వం కూడా దెబ్బతింటుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన చివరి దశలో రంగ ప్రవేశం చేశారు. హైదరాబాదులోనే వుంటానన్న గత ప్రకటనలకు కట్టుబడకపోయినా ఎంత రాత్రి వేళ అయినా వస్తానని చెప్పారు. జాతీయ పార్టీ అద్యక్షుడుగా తనకు రెండు రాష్ట్రాలలో పర్యటించే హక్కుందన్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీగా కూడా ప్రచారం చేసుకోవచ్చు. తమిళనాడు పార్టీలన్నీ పాండిచ్చేరిలో పోటీ పడుతుంటాయి. ఆయన చెప్పిన దానిలో కొత్త అంశాలేమీ లేవు గాని తన హయాంలోనే నగరం అభివృద్ధి అయిందనే పల్లవి షరామామూలుగానే వినిపించారు. నిజాం 400ఏళ్లలో చేసిన అభివృద్ది, ఆంగ్లేయులు వందేళ్లలో చేసిన అభివృద్ధి తను తొమ్మిదేళ్లలో చేశాననడం కొంత అతిశయోక్తి అనిపిస్తుంది. హైటెక్‌ టవర్‌ శిల్పారామం వంటివి కట్టినంత మాత్రాన అంతా తానే చేశానని అనుకోవడం అర్థరహితం. ఔటర్‌ రింగ్‌ రోడ్‌, విమానాశ్రయం వంటివి కూడా తానే ప్రారంభించానని కూడా చెప్పారు. ఏదిఏమైనా టిఆర్‌ఎస్‌పైన కెసిఆర్‌ఫైన తీవ్ర విమర్శలకు మాత్రం సిద్ధం కాలేదనేది స్పష్టం. కుమారుడు లోకేశ్‌ మోతమోగిస్తున్న అంశాలను కూడా అంటుకోకుండా అతి జాగ్రత్త వహించారు. ఇక గతంలో ఓటుకు నోటు నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రతిపత్తి గురించి అనేక మాటలు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఇక్కడే ఎన్నికలు జరుగుతున్నా పెదవి విప్పకపోవడం గమనార్హం. కేంద్రంలో తాము బిజెపి వున్నాము గనక తమ ద్వారానే నిధులు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పడం కొసమెరుపు.

కేర్‌ఫుల్‌గా కెసిఆర్‌

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ మీడియా సుదీర్ఘ సమావేశంలో సంచలనకరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలేమీ చేసింది లేదు. నగరాభివృద్ధికి సంబంధించిన సాధారణ వాగ్దానాలు ప్రణాళికలే వినిపించారు. గత పాలకుల వైఫల్యాలను దుయ్యబడుతూనే తమ వాగ్దానాలు అయిదేళ్లలో గాని పూర్తి కావని క్లారిటీ ఇచ్చారు. అంటే ఈ పదవీ కాలం మొత్తం కావాలన్న మాట. సచివాలయం తరలింపునకు కట్టుబడి వున్నామని వెనక్కు పోలేదని మరో ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడుకు ఎపిని అభివృద్ధి చేయడానికే సమయం చాలకపోయినా తెలంగాణకు వస్తున్నాడని గేళి చేశారు.అయితే మరీ తీవ్ర స్థాయిలో మాట్లాడేందుకు సిద్ధం కాలేదు. ఓటుకు నోటు సమస్యను కెటిఆర్‌ పక్కన పెట్టగా హరీష్‌ రావు లేవనెత్తారు. అయితే ఎన్నికలు ముగిశాక దానిపై మాట్లాడతానని కెసిఆర్‌ దాటేశారు. ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా టిఆర్‌ఎస్‌ విజయానికి మూడు దశల్లో అవకాశం వుందని వివరించారు.

మూడు మార్గాల్లో మేయర్‌..

మొదటిది స్వంతంగా మెజార్టి. రెండు తమ కోఆప్షన్‌లతో విజయం మూడవది మజ్లిస్‌ మద్దతు. ఈ సమయంలోనే మజ్లిస్‌ మతతత్వ పార్టీ అని వర్ణించేందుకు కెసిఆర్‌ ఎంతమాత్రం సిద్ధపడలేదు. వారి తత్వం బ్లడ్‌ గ్రూపునేనెక్కడ చెబుతానంటూ తప్పించుకున్నారు. కవిత కెటిఆర్‌ మజ్లిస్‌పై మతతత్వ విమర్శ చేస్తున్నారు కదా అంటే ఎవరో చెప్పిందానికి నేనెందుకు స్పందించాలని దాటేశారు.

ప్యాకేజీ లీకేజి టాకేజీ!
కేంద్రం పక్షపాతం గురించి చెబుతూ అప్పుడే వచ్చిన స్మార్ట్‌ సిటీల జాబితా చూపించి రాష్ట్రంలో ఒక్కనగరమైనా లేదని విమర్శించారు. తమకు ప్యాకేజీ ఇస్తే లీకేజి జరుగుతుందని చెప్పడం వెంకయ్య నాయుడు అంత్యప్రాస క్రీడ మాత్రమేనని తోసిపారేశారు. కావాలంటే తనకూ అద్బుతమైన బాష వచ్చునని చెప్పుకున్నారు.

వారసత్వంపై

తన కుమారుడు కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తర్ఫీదు నిస్తున్నారన్న మాటలను ఆయన తేలిగ్గా తీసిపారేశారు గాని ఖండించేందుకు స్పష్టత నిచ్చేందుకు సిద్ధపడలేదు. కెటిఆర్‌ ముఖ్యమంత్రి కావాల్నా ఇప్పుడున్నదానికన్నా ఎక్కువా అని ఒకసారి అడిగారు. ఎవరెవరు ఎలా అవుతారో చూడాల్సిందే గాని ఇప్పుడే ఏం చెప్తాం మరోసారి అన్నారు. అంతేగాని ఆ ఆలోచన లేదనీ అది అనవసర ప్రశ్న అనీ అనకుండా ఆ అభిప్రాయాన్ని సజీవంగా వుంచడం గమనార్హం.

హైదరాబాదులో వుండేవారంతా తెలంగాణ బిడ్డలు అని గాక అందరూ మా వాళ్లే అంటూ గతంలో చెప్పినదానికంటే ఒక అడుగు ముందుకు వేశారు. 1956కు ముందున్న వాళ్లు వగైరా షరతులు తీసుకురాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close