చైనా ఖేల్ ఖతం… భారత్ కు గొప్ప అవకాశం

డ్రాగన్ చైనా దూకుడు తగ్గింది. ఆర్థిక రంగంలో తిరుగులేని రారాజుగా భావించిన చైనా తడబాటు హెచ్చింది. మొన్న స్టాక్ మార్కెట్లు 30 శాతం పడిపోయిన తీరు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. వాపును బలుపుగా నమ్మించిన చైనా నిజస్వరూపం ప్రపంచానికి తెలిసొచ్చింది. షాంఘై స్టాక్ మార్కెట్ బేర్ మంది. చైనెక్స్ట్ ఇండెక్స్ 42 శాతం నష్టపోయింది. ఈ నష్టాలను తట్టుకోలేక కొందరు చిన్న మదుపుదారులు ఆత్మహత్య చేసుకున్నారనే వదంతులు వినిపించాయి. అవినిజమో కాదో అధికారిక సమాచారం ఏదీ లేదు. చైనాలో ఇలాంటి విషయాలు బయటకు రాకపోతే అందులో ఆశ్చర్యం లేదు.

చైనా జోరుకు కళ్లెం పడటం భారత్ కు అనుకోని వరం. ఆర్థిక రంగంలో, వృద్ధిరేటులో చైనాతో పోటీ పడుతున్న భారత్, పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది మంచి తరుణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా అంటే మేకింగ్ ఇండస్ట్రీ. కానీ అక్కడి తయారీ రంగంలోనూ సుమారు 30 నుంచి 40 శాతం వరకు ఉత్పత్తి పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. చైనా రియాల్టీ మందగించింది. దిగుమతులు తగ్గాయి. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు, ముడి ఇనుప ఖనిజం దిగుమతులను భారీగా తగ్గించింది.

చైనా ప్రభావంతో బంగారం, వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా తగ్గవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగదారు చైనా. కానీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోవడంతో చమురు వినియోగం కూడా తగ్గుతోంది. దీంతో డిమాండ్ భారీగా పడిపోయింది. దీనికి అంతర్జాతీయ అంశాలు తోడయ్యాయి. ప్రస్తుతం బ్యారెట్ ముడి చమురు 60 డాలర్ల లోపే ఉంది. ఇది 50 డాలర్ల స్థాయికి రావచ్చు. చైనా తిరుగులేని ఆర్థిక శక్తిగా భావించి బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టిన దేశాలు, కంపెనీలు లబోదిబో మంటున్నాయి. ఏ రకంగా చూసినా చైనా దెబ్బ అనేక దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు, చైనా కంటే భారత్ వృద్ధి రేటు అధికంగా ఉంటుందని ఐ ఎం ఎఫ్ తాజా అంచనా తెలిపింది. గత ఏడాది కూడా ఇలాగే అంచనా వేసింది. ఇప్పుడు 2016-17 ఆర్థిక సంవత్సరంలోనూ చైనాను భారత్ ఓవర్ టేక్ చేస్తుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అదే సమయంలో చైనా వృద్ధి రేటు 6.8 శాతమని తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే దేశం మనదే అని ఐఎంఎఫ్ తేల్చింది. వచ్చే ఏడాది ప్రపంచ సరాసరి వృద్ధి రేటు 3.3 శాతం ఉండవచ్చని లెక్కగట్టింది. చైనాను అధిగమించే శక్తి మనకుంది అనడానికి ఈ అంచనాలే నిదర్శనం. నరేంద్ర మోడీ వంటి దార్శనికుడు ప్రధానిగా ఉన్న సమయంలో మనకిది మంచి అవకాశం. గుజరాత్ ను ప్రగతి పథంలో నడిపినట్టే, దేశాన్ని ముందుకు నడపడానికి మోడీ ప్రభుత్వం సరైన వ్యూహం అనుసరిస్తే మనకు ఆకాశమే హద్దు.

చైనా ఆర్థిక దుస్థితిని భారత్ వీలైనంత క్యాష్ చేసుకోవాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. మేకిన్ ఇండియాకు పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేలా వ్యూహాలు ఉండాలి. భారీగా పెట్టుబడులు పెడితే కలిగే లాభాలను వివరించాలి. పన్ను రాయితీలు ఎలాగూ ఉంటాయి. భారత్ లో ఉన్న రాజకీయ, ఆర్థిక స్థిరత్వం గురించి పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిస్తే నిధులు ప్రవాహంలా వస్తాయనేది ఓ అంచనా. స్వేచ్ఛ విషయంలో్నూ చైనా కంటే భారత్ మెరుగు. పైగా భారత్ మార్కెట్ పెద్దది. మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉన్న దేశం. చైనాలో ఉన్నట్టు ప్రతిదానికీ ప్రభుత్వ ఆంక్షలు ఉండవు. ఈ దిశగా మోడీ ప్రభుత్వం కృషి చేస్తే భారీగా పెట్టుడులు రాబట్టవచ్చు. కొన్ని సంవత్సరాల్లోనే మన ఊహించని అభివృద్ధిని సాధించ వచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close