మెగాస్టార్‌లో ఇంత క‌న్‌ఫ్యూజ‌న్ ఏల‌..?!

ఇండ‌స్ట్రీలో పేరున్న ద‌ర్శ‌కులు ఓ 30 మంది ఉంటే.. అందులో స‌గం మంది చిరంజీవితో సినిమా చేస్తున్న‌మ‌న్న ఊహ‌ల్లో ఊరేగుతున్నారు. మారుతి, మోహ‌న్ రాజా, హ‌రీష్ శంక‌ర్‌, అనుదీప్‌, పూరి, త‌మిళ హ‌రి…. ఇలా ఈ లిస్టు చాంతాడంత ఉంది. ప్ర‌తీ ఒక్క‌రూ చిరుతో ట‌చ్‌లోనే ఉన్నారు. చిరు కూడా ‘మీతో సినిమా చేస్తా.. క‌థ రెడీ చేస్కోండి’ అంటూ అంద‌రికీ మాట ఇచ్చుకొంటూ వెళ్లిపోతున్నారు. యువ ద‌ర్శ‌కులంద‌రితోనూ ప‌ని చేయాల‌న్న కుతూహ‌లం, కోరిక చిరులో ఉన్నాయి. కాక‌పోతే వాటితో పాటే క‌న్‌ఫ్యూజ‌న్ కూడా ఉంది. అందుకే అంద‌రికీ మాట ఇచ్చేస్తున్నారు. ఎవరి నుంచి ఎలాంటి క‌థ వ‌స్తుందో ఎవ‌రికీ తెలీదు. స‌డ‌న్ గా ఓ ద‌ర్శ‌కుడు మంచి క‌థ‌తో మెస్మ‌రైజ్ చేయొచ్చు. అందుకే ఎందుకైనా మంచిద‌ని చిరు ఇలా అంద‌రికీ మాట ఇచ్చేస్తున్నార‌ని, క‌థ సెట్ అయితే కానీ, త‌న తుది నిర్ణ‌యం తీసుకోర‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. చిరు ఇంట ప్ర‌తీ రోజూ ఓ ద‌ర్శ‌కుడు క‌థ ప‌ట్టుకొని రావ‌డం, నేరేష‌న్ ఇవ్వ‌డం, చిరుకి న‌చ్చ‌క‌పోవ‌డం, మ‌ళ్లీ మార్పులు చేర్పులూ చేసుకొని ర‌మ్మ‌న‌డం.. ఇదే తంతు కొన‌సాగుతోంది.

నిజానికి ఇంత క‌న్‌ఫ్యూజ‌న్ చిరుకి ఎప్పుడూ లేదు. ఓ సినిమా చేస్తున్న‌ప్పుడు చిరు ఫోక‌స్ కేవ‌లం ఆ సినిమాపైనే ఉండేది. అది పూర్త‌య్యాక‌, అప్ప‌టి మూడ్ ని బ‌ట్టి క‌థ‌ని, ద‌ర్శ‌కుడ్ని ఎంచుకొనేవారు. ఇప్పుడు మాత్రం చిరు పంథాలో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. ‘చిరుతో సినిమా చేస్తున్నా’ అనే మూడ్ లో ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ప‌దిమంది ద‌ర్శ‌కులు తిరుగుతున్నారు. జూన్‌, జులైతో ‘విశ్వంభ‌ర‌’ పూర్వుతుంది. మ‌రి వెంట‌నే ఎవ‌రితో సినిమా చేయాల‌న్న విష‌యంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదు చిరు. కానీ ఈ ద‌ర్శ‌కులంతా ‘నాకే ఆ ఛాన్స్‌’ అంటూ మేఘాల్లో తేలిపోతున్నారు. మ‌రి ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌దే ఇప్పుడు మిలియన్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close