చిరుతో అమీర్‌ఖాన్‌ సినిమా…!

అమీర్ ఖాన్ న‌టించిన `లాల్ సింగ్ చ‌ద్దా`కి తెలుగులో స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు చిరంజీవి. చిరు స‌మ‌ర్ప‌ణ‌లో ఓ సినిమా రూపుదిద్దుకోవ‌డం ఇదే తొలిసారి. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ చిరు గ‌ట్టిగానే పాల్గొంటున్నాడు. చిరు, అమీర్‌, నాగ‌చైత‌న్య‌ల‌తో నాగ్ ఓ స్పెష‌ల్ వీడియో ఇంట‌ర్వ్యూ కూడా చేశాడు. ఈ సంద‌ర్భంగా.. చిరుతో ఓ సినిమా చేయాల‌ని ఉంద‌ని అమీర్ ఖాన్ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. దాంతో వెంట‌నే ఎగ్జైట్ అయిన చిరు.. ఓ కండీష‌న్ కూడా పెట్టాడు. “అన్నీ ఫ‌స్ట్ టేక్‌లోనే ఓకే చేస్తాను అంటేనే..“ అంటూ. అమీర్‌ని మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అని పిలుస్తారు. త‌న‌కు కావ‌ల్సిన‌ట్టు సీన్ వ‌చ్చేంత వ‌ర‌కూ టేకుల మీద టేకులు తీస్తూనే ఉంటారు. అందుకే చిరు.. ఈ క్లాజ్ ఉద‌హ‌రించాడు. దానికి నాగ్ స్పందిస్తూ…`ద‌ర్శ‌క‌త్వం వ‌ద్దు.. మీరు నిర్మాత‌గా ఉంటేనే బెట‌రేమో..` అని స‌ర్ది చెప్పాడు. సినీ ప్ర‌మోష‌న్ల‌లో ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వ‌డం మామూలే. కానీ అమీర్ ఖాన్ కేవ‌లం స్టేట్‌మెంట్ల కోసం మాట్లాడే వ్య‌క్తి కాదు. త‌ను అన్నాడంటే ఎంతో కొంత సీరియ‌స్‌నెస్ ఉంటుంది. ఒక‌వేళ చిరుతో నేరుగా సినిమా చేయ‌క‌పోయినా.. చిరు న‌టించిన ఓ సినిమాని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్ర‌మోట్ చేయొచ్చు. చిరు ప్లాన్ కూడా అదేనేమో..?

ఈ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా చిరుకి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న ఎదురైంది. `అమీర్ ఖాన్ న‌టించిన ఏ సినిమాని మీరు తెలుగులో రీమేక్ చేస్తారు?` అని. దానికి చిరు ఎలాంటి హిపోక్ర‌సీ లేకుండా స‌మాధానం చెప్పాడు. `అమీర్ ఖాన్ సినిమా చూడ‌డ‌మే గానీ, చేయ‌డం కుద‌ర‌దు..` అంటూ. అమీర్ ఇమేజ్ వేరు, చిరు ఇమేజ్ వేరు. రెండింటికీ పొంత‌న కుద‌ర‌దు. అందుకే.. చిరు ఇలా స్పందించాల్సివ‌చ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close