రామ్ చరణ్ సినిమా అంటే చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ తప్పని సరి. కథ, దర్శకుడు, కథానాయిక ఎంపిక.. రిలీజ్ డేట్ ఇలా సమస్త వ్యవహారాల్లోనూ చిరు జోక్యం చేసుకొంటారు. అయితే… ధృవ విషయంలో చిరు అంటీముట్టనట్టుగానే వ్యవహరించినట్టు టాక్. ఈ సినిమా వెనుక అల్లు అరవింద్ ఉండడం, తాను ఖైదీ నెం.150 షూటింగ్ లో బిజీగా ఉండడంతో.. ధృవ సినిమాకి సంబంధించిన విషయాలేం పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకూ అక్కడక్కడ రషెష్ చూడడం తప్ప సినిమాని పూర్తిగా చూసింది లేదని సమాచారం. ఈ సినిమా మొదలెట్టేటప్పుడు సురేందర్ రెడ్డికి చిరు చెప్పిన సూచన ఒక్కటే. ‘తని ఒరువన్ ని ఏమాత్రం మార్చకుండా తీయు’ అని సలహా ఇచ్చాడట.
దాన్ని తుచ తప్పకుండా సూరి పాటించాడని, అందుకే చిరు కలగచేసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదని తెలుస్తోంది. ట్రైలర్ చూశాక చిరుకి సూరిపై నమ్మకం మరింత బలపడిందట. ”ట్రైలర్ చూశాను… సినిమా చూసినట్టే అనిపించింది. ఇక చాలు…” అని భుజం తట్టి అభినందించాడట చిరు. ఆ నమ్మకంతోనే చిరు సూరికి సినిమా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఫలితం అటూ ఇటూ అయినా చిరు మైండ్‌లో సూరిపై ఉన్న ఇంప్రెషన్ తగ్గకపోవొచ్చు. ఎందుకంటే చిరు ఏం చెప్పాడో.. సూరి అదే చేశాడు. అందుకే ఈ సినిమా విడుదలవ్వకముందే.. చిరు సూరికి ఆఫర్ ఇచ్చేశాడు. మరోవైపు అల్లు అరవింద్ కూడా సురేందర్‌రెడ్డి ఎఫెర్ట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాడు. టేకుల మీద టేకులు తీసుకొని టైమ్ వేస్ట్ చేసే సూరి.. ఈ సినిమా మాత్రం అనుకొన్న బడ్జెట్లోనే పూర్తి చేశాడట. ఓ నిర్మాతకు అంతకంటే కావాల్సింది ఏముంది?
