తమిళ్లో సూపర్ హిట్ అయిన థనీ ఒరువన్ సినిమా రీమేక్‌లో రామ్ చరణ్ నటిస్తున్నాడన్న విషయం తెలియగానే చాలా మంది షాక్ అయ్యారు. చరణ్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌కి ఆ సబ్జెక్ట్ సూట్ అవుతుందా? థనీ ఒరువన్లో రామ్ చరణ్ స్థాయికి తగ్గ హీరోయిజం లేదు కదా…ఎలా మేనేజ్ చేస్తారు అని డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచీ సినిమాలో చేస్తున్న మార్పులు, చేర్పుల గురించి చాలా వార్తలే వచ్చాయి.
అయితే రామ్ చరణ్, సురేందర్‌రెడ్డిలు మాత్రం బేసిక్ ప్లాట్‌ని అస్సలు మార్చలేదని తెలుస్తోంది. అరవింద్ స్వామి చేసిన విలన్ క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ పేస్ట్ చేసేశారు. తెలుగులో కూడా ఆ క్యారెక్టర్ హీరోతో సమానంగానే ఉంటుంది. రామ్ చరణ్ ఎలివేషన్ కోసమని చెప్పి అరవింద్ స్వామి క్యారెక్టర్ని తగ్గించే ప్రయత్నాలేమీ చేయలేదు. అయితే అరవింద్ స్వామి తండ్రి క్యారెక్టర్ పోషించిన పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ని మాత్రం బాగా డెవలప్ చేశారని తెలుస్తోంది. నాయక్ సినిమాలో పోసాని చేసిన కామెడీ సీన్స్ ఆ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ధృవలో అంతకుమించి అనే స్థాయిలో పోసాని కామెడీ ఉంటుందని తెలుస్తోంది. అమాయకుడు, తెలివితక్కువ రాజకీయ నాయకుడిగా పోసాని చేసే కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. అలాగే ‘థనీ ఒరువన్’లో పోలీస్ ట్రైనింగ్‌కి సంబంధించిన సీన్స్ మరీ ఎక్కువ ఉండవు. కానీ తెలుగులో మాత్రం కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఆ ట్రైనింగ్ టైంలోనే చరణ్ సిక్స్ ప్యాక్ పిజిక్ని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశాడట సురేందర్ రెడ్డి.
థనీ ఒరువన్లో లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ కూడా తక్కువ ఉంటాయి. కానీ తెలుగులో మాత్రం కొన్ని లవ్ సీన్స్‌ని యాడ్ చేశారని తెలుస్తోంది. థనీ ఒరువన్ కంటే కూడా ధృవ సినిమాలో ఉండే లవ్ స్టోరీ ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక సినిమా అంతా కూడా కాస్త సీరియస్‌గా ఉంటుంది కాబట్టి మాస్ ఆడియన్స్‌ని మెప్పించడం కోసం రకుల్ గ్లామర్‌ని ఓ రేంజ్లో వాడేశారని తెలుస్తోంది. ఇంతకుముందు నటించిన వేరే ఏ సినిమాలోనూ చూపించని రేంజ్లో ఈ సినిమాలో రకుల్ స్కిన్ షో ఉంటుంది. వీటన్నింటికి అదనంగా అతనొక్కడే సినిమాతోనే స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్న సరేందర్రెడ్డి ధృవ సినిమా మేకింగ్‌తో సాటి డైరెక్టర్స్‌కి బెంచ్ మార్క్ సెట్ చేసే రేంజ్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడని చరణ్ సన్నిహితులు చెప్తున్నారు.
సో…చరణ్, సురేందర్‌రెడ్డిలు థనీ ఒరువన్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఎలా రీమేక్ చేయాలి అనే విషయంలో ఫుల్ క్లారిటీతోనే ఉన్నారన్న విషయం అయితే అర్థమవుతోంది. బేసిక్ హీరో-విలన్ ప్లాట్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ పేస్ట్ చేసేసి కామెడీ, గ్లామర్, చరణ్ లుక్స్, డ్యాన్స్‌లు, స్టైలిష్ మేకింగ్ విషయంలో మాత్రం మెగాభిమానులతో పాటు ప్రేక్షకులందరికీ నచ్చేలా తెరకెక్కించారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ‘ధృవ’ సినిమాకి పాజిటివ్ బజ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక రిలీజ్ డే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
