చిరంజీవి ఇంకా రాజకీయాలలో కొనసాగాలనుకొంటున్నారా?

సినీ పరిశ్రమని చిరకాలం ఏలిన చిరంజీవి, ఎన్టీఆర్ లాగ రాష్ట్రాన్ని కూడా ఏలేయాలనే కోర్కెతో రాజకీయాలలోకి వచ్చి పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ తరువాత ఏమయిందో అందరికీ తెలుసు. మళ్ళీ సినీ పరిశ్రమలోకి వచ్చి పడిన తరువాత ఇక రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉంటేనే మంచిది. బీసీలకు అన్యాయం జరగకుండా, వారి ఆగ్రహానికి గురికాకుండా కాపులకు ఏవిధంగా న్యాయం చేయాలో తెలియకనే చంద్రబాబు నాయుడు కమీషన్ వేస్తే, చిరంజీవి ఆ సమస్యను చిటికలో పరిష్కరించవచ్చన్నట్లుగా ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ వ్రాసి పడేశారు. కాపులకు బీసీలలో చేర్చుతూ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దానిని కేంద్రానికి పంపి చేతులు దులుపుకోమని సూచించారు.

దాని పర్యవసానాలు ఆయనకు తెలిసే అటువంటి సలహా ఇస్తున్నారో లేక కాపులను ఆకట్టుకోవాలనే ఆశతోనే ఆవిధంగా లేఖ వ్రాసారో తెలియదు కానీ సున్నితమయిన ఈ సమస్యకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే చిటికలో పరిష్కరించవచ్చని తేల్చి చెప్పేశారు. ఆయనకి విజయశాంతి మద్దతు పలకడం విశేషం. చిరంజీవిలాగే ఆమె కూడా రాజకీయాలలో రాణించలేకపోయారు కనుక బహుశః మళ్ళీ సినీ పరిశ్రమలోకి రావాలని భావిస్తున్నారేమో? ఇద్దరూ కూడా మంచి ప్రతిభ కల నటులే. అలాగే ఇద్దరూ కూడా రాజకీయాలలో తమ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోలేక చతికిలపడినవారే. చిరంజీవి కాపులను ఆకర్షించడానికి ఆవిధంగా అని ఉంటే, విజయశాంతి చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లుంది.

రాజకీయాలలో ఉంటూ సినిమా తారలలాగ, సినిమాలలో ఉంటూ రాజకీయ నేతల్లాగా మాట్లాడటం వలన ప్రజలను ఆకర్షించవచ్చునేమో కానీ దాని వలన ఎటువంటి ఫలితమూ ఉండబోదు. ఒకవేళ చిరంజీవి రాజకీయాలలోనే కొనసాగాలనే ఉద్దేశ్యం ఉంటే ఆయన రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయాలి. కానీ ఆపని చేయకుండా తన 151వ సినిమా తీసుకొంటున్నారు. అటువంటప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటే బాగుండేది కానీ మళ్ళీ కాపులకు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ‘నేను ఇంకా రాజకీయాలలోనే ఉన్నాను’ అని తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దాని వలన ఆయనకు ఒరిగేదేమి ఉండదు కానీ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

నాటి టీడీపీ పరిస్థితే నేడు వైసీపీది !

2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జాతీయ సర్వేలు వచ్చాయి. ఆ సర్వేలన్నింటిలో.. వైసీపీ భారీ విజయం సాధించబోతోందని అంచనా వేశాయి. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అవన్నీ పెయిడ్...

వైసీపీని “చెత్త కుప్ప”ల్లోకి చేర్చిన అంబటి రాంబాబు !

ఎన్నికల ప్రచారం చేయాలంటే ఓ ఆలోచన ఉండాలి. కానీ ఆ ఆలోచన వింతగా ఉంటే మాత్రం రివర్స్ అవుతుంది. దానికి అంబటి రాంబాబే సాక్ష్యం. ఇప్పుడు సత్తెనపల్లిలో ఎక్కడ చూసినా...

రేవంత్ కేబినెట్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..?

మంత్రి అవ్వాలనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరిక. ఇందుకు సంబంధించి తన మనసులోని మాటను పదేపదే వెలిబుచ్చుతూనే ఉన్నారు.కానీ, ఇక్వేషన్స్ కుదరకపోవడంతో...తాజాగా వచ్చిన అవకాశంతో మినిస్టర్ అయిపోవాలని రాజగోపాల్ రెడ్డి ఫిక్స్ అయినట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close