బొత్స సత్యనారాయణని చూసి జగన్ నేర్చుకోవాలి

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలను, ఈరోజు ఆయన పార్టీకే చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలతో పోల్చి చూసినట్లయితే ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడు ఏవిధంగా బ్యాలన్స్ డ్ మాట్లాడాలో అర్ధం అవుతుంది. ఇరువురూ కూడా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ జగన్ మాటలు అదుపు తప్పి చంద్రబాబు నాయుడు తిట్టిపోస్తున్నట్లు సాగగా, బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలు చాలా నిశితంగా సమస్యకు మూల కారణం ప్రభుత్వ వైఫల్యమేనని నిరూపించేవిగా ఉన్నాయి.

బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే “తునిలో జరిగిన విద్వంసాన్ని ముఖ్యమంత్రి కుట్ర అని చెపుతుంటే, మంత్రి నారాయణ అది ముద్రగడ పద్మనాభం ఆవేశంగా మాట్లాడినందునే జరిగాయని చెపుతున్నారు. తెదేపాలో కొందరు మంత్రులు వైకాపా కుట్ర అని గట్టిగా వాదిస్తుంటారు. మరి కొందరు ముద్రగడ పద్మనాభమే దీనికి కారకుడు అని వాదిస్తుంటారు. అంటే ఆరోజు జరిగిన వాటికి ఎవరు కారకులో, అది కుట్రో కాదో ప్రభుత్వానికి కూడా తెలియదన్నమాట. అది ప్రభుత్వ వైఫల్యమనో లేకపోతే సమాచార లోపం వలననో జరిగిందని ఒప్పుకోకుండా ఇతరులను నిందిస్తున్నారు ఎందుకు?

కాపులకు రిసర్వేషన్ల సమస్య చాలా ఏళ్ళుగా నలుగుతోందని చెప్పింది మీరే. దానిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది మీరే. కాపులకు వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించింది మీరే. మీరు ఆనాడు ఇచ్చిన హామీల గురించే ముద్రగడ అడుగుతున్నప్పుడు, ఆయనకు జవాబు చెప్పకుండా ఇతరులను నిందిస్తూ కాలక్షేపం ఎందుకు చేస్తున్నారు?
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2005లో ముద్రగడ పద్మనాభం వద్దకు వెళ్లి ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అదే పని ప్రతిపక్షాలు చేస్తే కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పు అవుతుందా?

ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించకుండా కాలక్షేపం చేస్తుండటం వలననే కాపులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి ఉద్యమబాట పట్టారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చేరు కనుక దానిని పరిష్కరించవలసిన బాధ్యత ఆయనదే తప్ప వేరేవరిదీ కాదు,” అని బొత్స సత్యనారాయణ చాలా నిశితంగా విమర్శించారు.

అదే జగన్మోహన్ రెడ్డి ప్రతీ వాక్యానికి ముందు వెనుక చంద్రబాబు నాయుడు ‘క్రిమినల్ నెంబర్:1’ కాదా? అని ప్రశ్నిస్తూ తను చెప్పిన విషయాల కంటే ముఖ్యమంత్రిని ‘క్రిమినల్’ అనడమే హైలైట్ అయ్యేలా చేసుకొన్నారు. చివరికి గంట సేపు కంటశోష తప్ప సాధించింది ఏమి లేదు. బొత్స సత్యనారాయణ కూడా అవే ప్రశ్నలు, విమర్శలు చేసినా అవి చాలా అర్ధవంతంగా ప్రజలను ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.

బొత్స సత్యనారాయణ ఎక్కడా మాట తూలకుండానే ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. పార్టీలో అటువంటి పరిణతి చెందిన అనుభవజ్ఞులయిన రాజకీయ నేతలు ఉండగా జగన్మోహన్ రెడ్డి వారిని సంప్రదించకుండా, వారి సలహాలను స్వీకరించకుండా తను చేసేదే రాజకీయం అని భావిస్తూ దుందుడుకుగా ముందుకు సాగుతున్నందునే తరచూ ఎదురు దెబ్బలు తింటూ పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారని చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close