“యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్” తెలుగు పాలకులు కనిపించరా?

Telakapalli-Raviయూనివర్సీటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఉద్రిక్తతల కారణంగా కేంద్రంలోని బిజెపి విమర్శలతో ఉక్కిరి బిక్కిరవుతున్న మాట నిజమే గాని మరో రెండు పాలకపక్షాలకూ విమర్శలు తప్పలేదు. ఇది కేంద్రానికి సంబంధించింది గనక తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. నిజానికి వేముల రోహిత్‌ ఆత్మహత్య వెంటనే విసి పైన, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలపై ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు నమోదు చేయడంలో పోలీసులు గట్టిగానే వ్యవహరించారు. అయితే కథ అక్కడితో ఆగిపోయింది. దానిపై ఎలాటి కొనసాగింపు లేదు. కేంద్రం కూడా ఏదో పరిశీలనా నివేదిక పేరుతో సరిపెట్టడం తప్ప ప్రక్షళన చేసింది లేదు. రాజకీయ ఇబ్బందులను బట్టి కేంద్రం కదల్లేదని తెలుస్తూనే ఉంది. కాని చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు ఎందుకు వేగంగా స్పందించలేదు? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, రాహుల్‌గాంధీ, సీతారాం ఏచూరి, సురవరం వంటి వారంతా బాధితులను సందర్శిస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్‌ గాని లేక ఆయన ప్రభుత్వం పార్టీల తరపున గాని ఎవరూ ఎందుకు సందర్శించలేదు? జిహెచ్‌ఎంఎసి ఎన్నికల కోసం హైదరాబాదును ఊపేస్తున్న మంత్రి కెటిఆర్‌ విద్యాసంస్థలతో తరచూ ముఖాముఖి జరుపుతుంటారు గదా…ఆయనైనా ఎందుకు దయచేయలేదు? దత్తాత్రేయ ఇంటిని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముట్టడించి ఉండొచ్చు గాని వారి అధినేత్రి పరామర్శించేందుకు రాకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అలాగే ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఆయన సహచరులు గాని, అగ్గిబరాటాలుగా చెలరేగిపోయే రేవంత్‌ రెడ్డి వంటి వారు గాని దళిత నేతల ముద్రాంకితులైన మోత్కుపల్లి నరసింహులు వంటివారు గాని మొహం చూపించకపోవడానికి కారణమేమిటి? ఇక ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని, చినబాబు లోకేష్‌ గాని ఇటుకేసి రాకపోవడానికి కారణాలున్నాయా?

ఏదైనా ఘటన జరిగినప్పుడు కేవలం మొక్కుబడిగా వచ్చిపోతే ఉపయోగం లేదన్నది ఒకటి. కాని తాము అండగా ఉంటామని చెప్పడానికి ఏదో రూపంలో సందర్శించడం రాజకీయ పక్షాల బాధ్యత. టిడిపి, టిఆర్‌ఎస్‌లు ఆ పని చేయకపోవడానికి స్థానిక, జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. హైదరాబాదు ఎన్నికల్లో అన్ని కులాల ఓట్లు రావాలంటే కేవలం దళితులతో ముడిపడిన ఈ ఆందోళనకు దూరంగా ఉండాలి. రెండోది కేంద్రంలో బిజెపితో మంచిగా ఉండాలంటే ఇందులో తలదూర్చనేకూడదు.

ఈ పార్టీలు, ప్రభుత్వాలు ప్రయోజనాలను బట్టి తప్ప ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం వంటి అంశాలకు విలువ నిచ్చేవి కావని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా? అసహనంపైన ఇప్పటి వరకూ ఉభయ చంద్రుల నుంచి ప్రకటనే రానప్పుడు ప్రతిఘటనను బలపర్చేందుకు ప్రత్యక్షంగా కదలిరావడం ఊహకందేదేనా? అదే బిజెపి ధీమా కూడా. ఏమైనా ఉమ్మడి రాజధాని హైదరాబాదులో జరిగిన ఘటనపై డిల్లీ ముఖ్యమంత్రి తప్ప తెలుగు పాలకులు కనిపించకపోవడం విడ్డూరమే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close