ఆలయానికి పునాది : భారత రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన అయోధ్య రాముడు..!

అయోధ్య అంశం.. దేశంలో అత్యంత కీలకమైన రాజకీయ మార్పులకు కారణం అయింది. ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ.. పునాదులు అయోధ్య రామాలయం వద్దనే ఉన్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే…రామాలయ సమస్యకు పరిష్కారం లభించింది. అయోధ్య దశాబ్దాలుగా రాజకీయ అంశంగా ఉంది. హిందువులకు అది పవిత్ర స్థలం. అయితే.. కారణాలు ఏవైనా రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య పరిష్కారానికి కృషి చేశారు. విభిన్న మార్గాల ద్వారా ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిగాయి. కోట్లాది హిందువుల మనోభావాలను సంబంధించిన అంశంగా పరిగణిస్తూ, ఉద్రిక్తతలకు ఆస్కారం లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేశారు. 135 సంవత్సరాలుగా కోర్టు వివాదాలతో ఆవేశాలు, ఉద్రిక్తతలు చెలరేగి దేశంలో పలు పరిణామాలకు కేంద్రంగా అయోధ్య మారింది. పార్లమెంట్‌లో చట్టం చేసి…రామాలయం కడతామని బీజేపీ చెబుతూ ఉండేది.

రథయాత్రతో రాముడి గుడిని ఎజెండాగా మార్చిన అద్వానీ..!

ఏళ్లుగా హిందూ సంస్థలు అక్కడ రామాలయం నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చింది బీజేపీ నేత అద్వానీనే. 1990లో సోమనాథ్‌ నుండి అయోధ్య వరకు నాటి బిజెపి అధ్యక్షుడు ఎల్‌.కె. ఆద్వానీ రథయాత్ర చేశారు. 1990 సెప్టెంబర్‌ 25న సోమ్‌నాథ్ మందిరం నుంచి ప్రారంభమైన యాత్ర దేశ రాజకీయ స్వరూపంలోనే నిర్ణయాత్మక మార్పును తీసుకువచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. బీజేపీ ప్రభుత్వం వస్తే, పార్లమెంటులో చట్టం చేసి రామ మందిరం నిర్మిస్తామని బీజేపీ చెప్పేది. 1999లో అధికారంలోకి వచ్చిన అటల్‌ బిహారీ వాజపేయి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఇరువర్గాల మధ్య పరిష్కారం కోసం ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అయోధ్య అంశం ఇప్పుడు ప్రశాంతంగా, సామరస్యంగా పరిష్కారం అవుతోంది 2014లో పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం వచ్చింది. అయితే.. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందు వల్ల చట్టం చేయలేదు. చివరకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే… ఆలయాన్ని నిర్మిస్తున్నారు..

మొదట రాజీవ్ గాంధీనే ..!

అయోధ్యలోని రామాలయాన్ని 16వ శతాబ్దంలో బాబర్‌ ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ విషయమై తొలుత 1885 అక్కడి మహంత్‌ స్థానిక కోర్టులో దావా వేసాడు. అక్కడ రామాలయం ధ్వంసం చేసి మసీదు కట్టారని ఆరోపించాడు. 1949 అలాహాబాద్‌ హైకోర్టు హిందువులకు అక్కడ శ్రీరాముడి విగ్రహం పెట్టి, కోర్టు పర్యవేక్షణలో సంవత్సరానికి ఒకసారి ప్రార్థనలు చేయడానికి అనుమతి ఇచ్చింది. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1986లో శ్రీరాముడి విగ్రహానికి రోజువారీ పూజలకు అనుమతి ఇచ్చారు. 1988లో రామాలయ నిర్మాణానికి శిలాన్యాస్‌ జరపడానికి రాజీవ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1989లో ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య నుండి రామరాజ్యాన్ని నెలకొల్పుతామని హామీ ఇస్తూ రాజీవ్‌ గాంధీ ప్రారంభించారు. ఆ తర్వాత ఆ నినాదాన్ని బీజేపీ అందుకుంది. రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో 1991లో వివాదాస్పద బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు.

ఎలాంటి వివాదాలు లేకుండా ఆలయ నిర్మాణం..!

ఇప్పుడు.. ఎక్కడా వివాదం లేదు. అంతా హంగామానే ఉంది. రామ మందిర నిర్మాణం కోసం జరిగే భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. గ‌ర్భగుడిలో జ‌రిగే పూజ కోసం 11 మంది పండితులు వేద‌మంత్రాలు చ‌ద‌వ‌నున్నారు. ప్రధాని మోదీ చేత భూమిపూజ చేప‌ట్టనున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం అనేది కోట్లాది మంది హిందువుల స్వప్నం. సుదీర్ఘ కాలం.. భారత రాజకీయాలను శాసించిన అంశంగా.. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌గా మారిన రామాలయం అంశం ఇప్పటికి పరిష్కారం అయింది. మూడేళ్లలోనో.. నాలుగేళ్లోనే.. ఆలయం పూర్తయిన తర్వాత.. ఓ సోమనాథ్.. ఓ తిరుమలలా అయోధ్య కూడా శోభిల్లుతుందనడంతో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close