అయోధ్య రామునికి సర్వశోభిత ఆలయం..! భూమిపూజకు సర్వం సిద్దం..!

ఎన్నాళ్లో వేచిన ఉదయం సాక్షాత్కరించబోతోంది. దశాబ్దాలుగా హిందువులు ఎందురు చూస్తున్న మహాఘట్టానికి తెర లేస్తోంది. అందరి అంగీకారంతో… అయోధ్యలో రామాలయ నిర్మాణం ఐదో తేదీన ప్రారంభం కానుంది. అనితర సాధ్యమైన నిర్మాణ శైలితో… రాముడికి ప్రణామాలు అర్పించనున్నారు. ఈ ఆలయం నిర్మాణం తర్వాత దేశంలోనే అత్యంత ప్రముఖమైన దివ్య క్షేత్రంగా అయోధ్య ప్రఖ్యాతి గాంచే అవకాశం ఉంది. అయోధ్యలోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు భూమి గురించి దశాబ్దాల పాటు నడిచిన కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడ రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం అయింది. శతాబ్దానికిపైగా నడిచిన వివాదం.. చివరికి పరిష్కారం అయింది. ఇప్పుడు హిందువుల కల నెరవేరుతోంది. అయోధ్యలో రామాలయానికి భూమి పూజ జరుగుతోంది.

రామాలయం నిర్మాణం కోసం ప్రత్యేకంగా జూలై 18 న రామ‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. భూమిపూజ కార్యక్రమం రామాలయం తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వరంలోనే జరుగుతోంది. రామాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రపంచంలో ఉన్న హిందువుల‌ు అందరూ చూడగలిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రామాలయం శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తం రెండు వందల మంది ప్రముఖులు శంకుస్థాపనకు హాజరు కానున్నారు. ఇందులో అంబానీ, ఆదానీ లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రామ మందిరం నిర్మాణంలోనే కాకుండా అయోధ్య నగరంలో సదుపాయాల కల్పనలో కార్పొరేట్‌ సంస్థలు పెద్దఎత్తున పాలు పంచుకునే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సంబంధ పర్యాటకంలో అయోధ్యను గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు వేస్తున్నాయి.

రామలయ నిర్మాణ శైలి ఊహకందని రీతిలో ఉండనుంది. 161 అడుగుల ఎత్తైన రామాలయ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. మొద‌ట అనుకున్న ఆల‌య నిర్మాణంలో మార్పులు చేర్పులు చేశారు. కొత్త డిజైన్‌లో మూడు గోపురాలు ఉంటాయి. ముందు ఒకటి ఇరువైపులా రెండు గోపురాలు. నిలువు వరుసల సంఖ్య 366 ఉంటుంది. మెట్ల వెడల్పు 16 అడుగులు ఉంటుంది. వైష్ణవాల‌యాల శాస్ర్త ప్రకారం గ‌ర్భగుడి అష్టభుజిగా ఉంటుంది. సీత, లక్ష్మణ, గణప‌తి, హనుమంతుడుతో పాటు ఇతర దేవతల కోసం మరో నాలుగు మందిరాలు ఈ సముదాయంలో భాగంగా ఉంటాయి. ఒక వైపున కథా కుంజ్ ఉంటుంది. అక్కడ రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రదర్శించవచ్చు. ఆ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్. భోజనశాల, ధర్మశాల. స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. నాలుగు వైపులా అన్ని దిక్కుల్లో గేట్లు ఉంటాయి. నగర విష్ణు ఆలయం శైలిలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆలయ విస్తీర్ణం సుమారు 76 వేల చదరపు గజాల నుంచి 84వేల చదరపు గజాలు ఉంటుంది. ఆలయ నిర్మాణంలో ఎలాంటి లోహాలు ఉపయోగించడం లేదు. మొత్తం శిల్పాల ద్వారానే నిర్మిస్తారు. ఇవి కనీసం వెయ్యి నుంచి పన్నెండు వందల ఏళ్ల వరకు… మన్నికగాఉంటాయి. ప్రతి స్తంభానికి 16 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలను హిందూ పురాణాల ప్రకారం వేరు వేరుగా రూపొందిస్తారు.

మే రెండో వారంలోనే భూమిని చదునుచేసి, శుభ్రం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ క్రమంలో జరిగిన తవ్వకాల్లో ఐదడుగుల శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు, శిల్పాలు చెక్కివున్న స్తంభాలు, ఎర్రరాతి ఇసుక ధ్వజాలు, కలశం, రాతి పుష్పాల లాంటివి బయటపడ్డాయి. ఇవన్నీ పురాతన ఆలయానికి సంబంధించినవే. తవ్వకాల్లో బయటపడినవాటినన్నిటినీ భద్రం చేసి భవిష్యత్తులో ఏర్పాటుచేయబోయే మ్యూజియంలో ఉంచబోతున్నారు. వెండి ఇటుకలతో జరిగే భూమిపూజలో ప్రధాని మోదీ మొదటి ఇటుకను పేర్చనున్నారు. హిందూ పురాణాల ప్రకారం అయిదు గ్రహాలకు సూచకంగా అయిదు వెండి ఇటుకలను వాడనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close