ప్రభుత్వ తప్పిదాల వల్లే స్థానిక ఎన్నికల రద్దు..!?

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రక్రియ రద్దు చేస్తారన్న కారణంగానే.. నిమ్మగడ్డ ప్రసాద్‌ను మళ్లీ ఎస్‌ఈసీ పదవిలో కూర్చోకుండా.. ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. ఇప్పుడు.. నిమ్మగడ్డకు అలాంటి అవకాశం లేకుండా.. నిబంధనల ప్రకారమే… స్థానిక ఎన్నికలు రద్దయిపోయేలా చేస్తోంది. దీనికి కారణం.. వ్యూహాత్మకంగా చేస్తున్న తప్పిదాలే. ఏపీ సర్కార్ ఎన్నికల ప్రక్రియను మార్పు చేస్తూ.. ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. 21 రోజుల్లో ఎన్నికలు పూర్తయ్యేలా ఆ ఆర్డినెన్స్ ఉంది. అయితే.. ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలో తీసుకు రాలేదు. బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశం పెట్టినా… ఆ ఆర్డినెన్స్ ను చట్ట రూపంలోకి తేలేకపోయారు.

దాంతో ఆరు నెలలు ముగియగానే.. ఆటోమేటిక్‌గా.. ఆ ఆర్డినెన్స్‌కు కాలం చెల్లింది. అయితే.. ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఒకే అంశంపై రెండు సార్లు ఆర్డినెన్స్ తీసుకు రావడం.. చెల్లదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే … ఎన్నికల ప్రక్రియ రద్దు అవడం ఖాయమని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్డినెన్స్ ను వెంటనే చట్ట రూపంలోకి తీసుకువచ్చినా ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ చెల్లదని అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. న్యాయస్థానాలను ఆశ్రయించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

అయితే.. ఒక వేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ముందుగానే… ఈ అంశంపై… స్థానిక ఎన్నికలు ఎక్కడ ఆగాయో.. అక్కడి నుంచే కొనసాగించాలని కానీ.. లేదా మొత్తం ప్రక్రియను రద్దు చేయాలని కానీ నిర్ణయం తీసుకుంటే… న్యాయస్థానాలు కూడా…జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగవ్యవస్థ. అందుకే… నిమ్మగడ్డ నిర్ణయమే ఫైనల్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close