బీఆర్ఎస్..వై దిస్ ఫేక్ కొలవెరి !?

రేవంత్ రెడ్డి ఏం చేసినా .. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా .. చేయకపోయినా వెంటనే దురుద్దేశాలు ఆపాదిస్తూ.. ఫేక్ పోస్టులతో విరుచుకుపడుతోంది బీఆర్ఎస్ సోషల్ మీడియా. తప్పుడు ప్రచారం చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కేసులు పెడుతోంది. గత కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలపై వందల్లో కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కేసుల పాలవుతున్నారు. కోడ్ ముగిసిన తర్వాత వారందరికీ చుక్కలు చూపించకుండా కాంగ్రెస్ ఉండదు.

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత పెంచాలంటే ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం తప్ప మరొక దారి లేదన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎలాంటి లోగో రిలీజ్ చేయలేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనే ఉమ్మడి రాష్ట్ర లోగో లో ఏపీ తీసేసి టీజీ పెట్టి ఇదే లోగో అని ప్రచారం చేశారు. దానికి తెలంగాణ సెంటిమెంట్ జోడించి రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాయంత్రానికి కేసుల పాలయ్యారు. ఇది ఒకటే.. కానీ రోజుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. పోలీసులు కేసులు పెడుతూనే ఉన్నారు.

ఫేక్ న్యూస్ లు వేసుకుని .,. చివరికి నిజాలు చెప్పినా కూడా నమ్మని పరిస్థితి వస్తుందన్న సంగతిని బీఆర్ఎస్ సోషల్ మీడియా మర్చిపోతోంది. క్రమబద్దంగా ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ పోవాలి కానీ.. తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల జరిగే లాభం ఏమీ ఉండదని ఇప్పటికే రాజకీయ చరిత్ర చెబుతోంది. ఎన్నికల సమయంలో ప్రజల్లో భావోద్వేగాలు పెంచడానికి ఫేక్ అస్త్రం ఏమైనా ఫలితం ఇస్తుందేమో కానీ.. ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత చేసే ఇలాంటి పనులు… ఫ్రస్ట్రేషన్‌ను సూచిస్తాయి.

క్యాడర్ అంతా కేసుల పాలైతే… వారి కోసం కోర్టుల చుట్టూ తిరగడం.. వారి భవిష్యత్ ను నాశనం చేయడం తప్ప… రాజకీయంగా సాధించేదేమీ ఉండదు. అయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఫేక్‌లనే నమ్ముకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో హాట్ టాపిక్ ” జగన్ ప్యాలెస్ “

పేదల సీఎం గా తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి పెద్ల దగ్గర వసూలు చేసిన పన్నులతో కట్టిన ప్యాలెస్ చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతోంది. వందల కోట్లు ఖర్చు...

పబ్లిక్‌కి రుషికొండ ప్యాలెస్ గేట్లు ఓపెన్

రుషికొండ వైపు అడుగు పెడితే అరెస్టు చేసేవారు ఎన్నికలకు ముందు.. ఇప్పుడు .. రుషికొండ ప్యాలెస్ గేట్లు ప్రజలు చూసేందుకు ఓపెన్ చేశారు. గంటా శ్రీనివాసరావు స్థానిక నేతలు, మీడియా ప్రతినిధులతో వెళ్లి...

ఈవీఎంలు అయితే ఇక వైసీపీ ఎన్నికల బహిష్కరణే !

ఈవీఎంలను శకుని పాచికలు అని.. ఎటు కావాలంటే అటు పడుతున్నాయని జగన్ రెడ్డి కొత్త మాట చెబుతున్నారు. ఆయన పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఇదే జగన్ 2019 ఎన్నికల...

“రీ డిజైన్” క్రెడిట్ కేసీఆర్‌దే !

ప్రాజెక్టులను రీడిజైన్ చేసింది కేసీఆర్. ఈ మాట ఆయన చెప్పుకున్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు సంబంధం లేదంటున్నారు. ఎందుకంటే... విచారణ నుంచి తప్పించుకోవడానికి. కేసీఆర్ ది కాకపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close