జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరి డిమాండ్లు అంగీకిరంచే పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ఎన్నికలలోపే ఏదో ఒకటి చేయాలని ఆరాటపడుతున్నారు. అందరూ వరుసగా బయటకు వస్తున్నారు.
ఇప్పటికే ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నిధుల కోసం ఓ రౌండ్ బెదిరింపులు పూర్తి చేశాయి. కాలేజీలు కూడా సమ్మెలో ఉన్నాయి. ఉన్న పళంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. కనీసం రూ. ఐదు వేల కోట్లు ఉన్న పళంగా కట్టాలని ప్రభుత్వం మెడపై కత్తి పెట్టాయి. పోలింగ్ తేదీ కన్నా ముందే భారీ బహిరంగసభ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా అదే వార్నింగ్ ఇస్తున్నారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందేని అల్టిమేటం ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి చెల్లింపులు రావాల్సిన వారంతా ఇలా వరుసగా బయటకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికీ బుజ్జగింపులు చేస్తూనే ఉంది. కేసీఆర్ హయాంలో అయితే.. ఇచ్చినప్పుడు తీసుకునేవారు. ఒక్కరూ కిక్కురుమనేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం వారంతా బెదిరింపులకే దిగుతున్నారు. పోలింగ్ అయిపోయాక వీరంతా.. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే ఏం చేస్తారో చూడాల్సి ఉంది.