ఏపీ సర్కార్ కంటే ముందుగానే సుప్రీంకోర్టుకు విపక్షాలు..!

ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తోంది. పలువురు నేతలు ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. దీంతో ఒక వేళ ఏపీ సర్కార్ పిటిషన్ వేసిన వెంటనే….స్టే దొరకుండా…వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మస్తాన్ వలీ తన న్యాయవాదితో ఈ మేరకు కేవియట్ దాఖలు చేయించారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే.. తమ వాదన విన్న తర్వాత ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వాలని కోరుతూ..ఈ కేవియట్ దాఖలయింది.

హైకోర్టు తీర్పు అందిన వెంటనే.. రమేష్ కుమార్.. తాను ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆయన హైదరాబాద్ నుంచి పని చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ కార్యాలయంతో పాటు… విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి కూడా విధులు నిర్వహించనున్నారు. సోమవారం ఆయన విజయవాడ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చే లాక్ డౌన్ సడలింపుల ఆధారంగా.. ఆయన రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించి…ఎన్నికల విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఎస్‌ఈసీగా ఉన్నప్పుడు కనగరాజ్ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తూ.. ఓ ఉత్తర్వు ఇచ్చారు. ఆయన నియామకమే చెల్లదని.. తేలింది కాబట్టి .. ఆ ఉత్తర్వులు కూడా చెల్లవు. దాంతో గతంలో తాను జారీ చేసిన ఆరు వారాల వాయిదా ఉత్తర్వులకు కొనసాగింపుగా మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆయనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది కాబట్టి.. ముందు జాగ్రత్తగా..కొంత మంది సుప్రీంకోర్టులో కేవియట్ వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close