రాష్ట్రపతికీ గౌరవం ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు?

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే ముందు ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగంలో సభ్యులు అందరూ ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతలను గుర్తుంచుకొని ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రజా సమస్యలపై అర్ధవంతమయిన చర్చలు జరిగేందుకు సహకరించాలని కోరారు. కానీ ఆయన సూచించిన ఆ సలహా కాంగ్రెస్, దాని మిత్రపక్షాల చెవులకి చేరినట్లు లేదు.

ఆయన తన ప్రసంగం ముగించిన మరు క్షణమే కాంగ్రెస్ పార్టీ ఎంపిలో స్పీకర్ వద్దకు దూసుకువచ్చి ఆయన ప్రసంగాన్ని తప్పుపడుతూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆయన ప్రసంగం తమకు చాలా నిరాశ కలిగించిందని, అందులో ప్రజలను ఆకట్టుకొనే నినాదాలు తప్ప బొత్తిగా పస లేదని కాంగ్రెస్ ఎంపి రాజీవ్ శుక్లా అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకువచ్చిన మరొక కాంగ్రెస్ పార్టీ ఎంపి అశ్విని కుమార్ “ప్రభుత్వానికి ఒక దశదిశ లేదని రాష్ట్రపతి ప్రసంగంలో స్పష్టమయింది. ఏ మాత్రం ఆసక్తి కలిగించని, పసలేని ప్రసంగం అది,” అని అన్నారు. వారితో ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు జతకలిసి నినాదాలు చేస్తూ సభలో నానా రభస చేసారు.

నిజానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆ స్థాయికి ఎదగగలిగారు. తను ఆ స్థాయికి ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీయే కారణం కనుక ఆయనకు పార్టీ పట్ల చాలా అభిమానం, గౌరవం ఉన్నాయి. అలాగే అయన కాంగ్రెస్ పార్టీలో, యూపీఏ ప్రభుత్వం ఎన్ని ఉన్నత పదవులలో పనిచేసినప్పటికీ పార్టీలో అందరితోను చాలా గౌరవంగా, చాలా స్నేహపూర్వకంగా మెలిగేవారు. కనుక కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆయనని చాలా గౌరవిస్తారు. కానీ ఆయన ఆనవాయితీ ప్రకారం తన క్రింద పనిచేస్తున్న ప్రభుత్వం తరపున పార్లమెంటులో ప్రసంగించితే దానినీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తప్పు పడుతున్నారు. ఆయనని సభలో గౌరవించలేకపోయారు.

కాంగ్రెస్ పార్టీకి మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఉండవచ్చును. కానీ ఆ కారణంగా రాష్ట్రపతి పట్ల అవమానకరంగా ప్రవర్తించనవసరం లేదు. ఆయన ప్రసంగాన్ని తప్పుపడుతూ సభలో ఆయన ముందే అసభ్యంగా మాట్లాదనవసరం లేదు. సభ నుండి ఆయన వెళ్లిపోయిన తరువాత, ఆయన ప్రసంగంతో తాము ఏకీభవించడం లేదని ఒకే ఒక ముక్క చెపితే సరిపోయేది. అందరికీ గౌరవంగా ఉండేది. కానీ మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, ప్రణబ్ ముఖర్జీ తమతో కలిసి నాలుగు దశాబ్దాల సుదీర్గ కాలం పనిచేసారనే సంగతిని, ప్రస్తుతం ఆయన రాష్ట్రపతిగా మాట్లాడుతున్నారనే కనీస గౌరవం కూడా కనబరచకుండా ఆయన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. రాష్ట్రపతికి కూడా గౌరవించలేని కాంగ్రెస్ నేతలు ఇంకెవరిని గౌరవించగలరు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో అప్పులకు తగ్గట్లుగా సంపద పెరుగుతోందా..!?

ఆంధ్రప్రదే్శ్ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తోంది. ఈ విషయాన్ని కాగ్ స్పష్టంగా చెప్పింది. అప్పులు చేయడం తప్పు కాదు. కానీ ఆ అప్పులకు తగ్గట్లుగా ఆస్తులను క్రియేట్ చేసినప్పుడు మాత్రమే... తిరిగి...

స్టీల్ ప్లాంట్ మద్దతు బంద్‌కు వైసీసీ సపోర్ట్ లేనట్లే..!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఉద్యమం బంద్ దశలోకి వచ్చింది. ఐదో తేదీన ఏపీ వ్యాప్తంగా బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు వామపక్షాలు లీడ్ తీసుకుని రంగంలోకి దిగి...

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిదే దేశద్రోహం కాదు..! మరి రక్షణ దేశంలో ఉందా..!?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన కేసులో కోర్టు ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది....

ఏపీలో పోర్టులన్నీ ఆదాని పరం..!

ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త...

HOT NEWS

[X] Close
[X] Close