ఆగస్ట్ 31న సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ ‘కంట్రోల్ సి’ ఆడియో వేడుక

అశోక్‌, దిశాపాండే హీరో హీరోయిన్లుగా సెకండ్‌ ఇండిపెండెన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కంట్రోల్‌ సి’. సాయిరామ్‌ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆగస్ట్ 31న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా…
నిర్మాత తాటిపర్తి ప్రభాకర్‌ మాట్లాడుతూ ”దేశభక్తి ఉండేలా మా బ్యానర్‌కి ఈ పేరుని పెట్టాం. నేను, నా మిత్రుడు, దర్శకుడు సాయిరామ్‌ చల్లా ఇద్దరం సాఫ్ట్ వేర్‌ రంగానికి చెందినవాళ్లం. ఎంటర్‌టైన్మెంట్‌తోపాటు మెసేజ్‌ ఉండేలా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు మాకు సుకుమార్‌గారు పరిచయం కావడంతో ఈ రంగానికి సులభంగా వచ్చాం. ఆయన గైడెన్స్ లో ‘కంట్రోల్ సి’ అనే ఒక డిఫరెంట్‌ మూవీ చేశాం. అలాగే సుకుమార్‌గారు ఆయన అన్నగారి అబ్బాయి అశోక్‌ను మా చేతుల్లో పెట్టారు. అశోక్‌ ఎక్స్‌ట్రార్డినరి పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. సాఫ్ట్ వేర్‌ క్యాంపస్‌లో జరిగే థ్రిల్లర్‌ మూవీ. ట్విన్‌ టవర్స్‌ కూలిపోయినప్పుడు ప్రాణాలతో బయటపడిన హీరో, హీరోయిన్ కి ఒక సీడీ దొరుకుతుంది. ఆ సీడీని వాళ్ల జీవితాల్లో ఎలాంటి రోల్‌ ప్లే చేసిందనేదే సినిమా. కంప్యూటర్‌ చేసే హర్రర్‌ మూవీ. ఇలాంటి జోనర్‌ మూవీ ఇప్పటి వరకు రాలేదు. డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కలుగుతుంది. ఇటీవల విడుదలైన మోషన్‌ పోస్టర్‌ కి మంచి స్పందన వచ్చింది. అచ్చు ఎక్సలెంట్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని రాజకీయ, సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఆగస్ట్ 31న హైదరాబాద్ లోని జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నాం’’ అన్నారు.

బెనర్జీ, సమీర్‌, పృథ్వీ, హేమ, తాగుబోతు రమేష్‌, శంకర్‌, గణపతి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, సాహిత్యం: శ్రీమణి, సంగీతం: అచ్చు, ఆర్ట్‌: డి.వై.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శ్రీధర్‌ సనగాల, కో ప్రొడ్యూసర్‌: విజయ్‌ మోహన్‌ రెడ్డి బాతుల, ప్రొడ్యూసర్‌: ప్రభాకర్‌ రెడ్డి, తాటిపర్తి, దర్శకత్వం: సాయిరామ్‌ చల్లా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close