సుభాష్ : గెలుస్తామని నమ్మకం ఉంటే కోడ్‌ పేరుతో ఈ రచ్చ ఎందుకు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విభిన్న పరిస్థితులు ఉన్నాయి. దేశం మొత్తంలో ఉన్న కోడ్ రూల్స్ అన్నీ… మరిన్ని విశేషాధికారాలు జోడించుకుని మరీ ఏపీలో అమలవుతున్నాయి. ఎంతగా అంటే… ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా అధికారాలు లేవని.. అంతా తమ ఇష్టారాజ్యమని… సీఈవో, సీఎస్‌లు చెలరేగిపోయేంతగా… కోడ్ అమలవుతోంది. చివరికి రాజ్యాంగానికి కొత్త భాష్యం చెప్పి.. చంద్రబాబును ఆపద్దర్మ సీఎం అంటున్నారు. ఓ వైపు… కేబినెట్ నిర్ణయాలను సైతం ప్రశ్నిస్తూ.. ఎల్వీ సుబ్రహ్మణ్యం చెలరేగిపోతున్నారు. ఐదేళ్ల నిర్ణయాలను కూడా.. ఆయన బయటకు తీస్తున్నారట. .. !

ఎజెండా.. ఢిల్లీ టు గల్లీ ..! ఇంత హడావుడి ఎందుకు..?

రాజ్యాంగం ప్రకారం.. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందుల్లేకుండా చేసుకునేందుకు ఈసీకి పూర్తి స్థాయి.. అధికారాలు ఉంటాయి. స్పష్టంగా చెప్పుకోవాలంటే… ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రమే.. ఈ అధికారాలు. ఏపీలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు… సీఎస్‌ను బదిలీ చేశారు. దానికి కారణం… ఎన్నికలు కాదు. కానీ… ఎన్నికలే అని చెప్పుకోవడానికి అన్నట్లుగా.. బదిలీ చేసిన పునేఠాకు ఎన్నికల విధులు అప్పగించవద్దని ఓ లైన్ రాశారు. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం చేరారు. ఆయన పని ఎన్నికల విధుల వరకే. ఎందుకంటే.. ఈసీ నియమించిన సీఎస్… ఇంత కంటే ఎక్కువ జోక్యం చేసుకోవడం నైతికత కాదు. కానీ… నెలన్నర రోజుల్లో ప్రభుత్వం వచ్చే లోపు ఏదో చేయాలన్న తాపత్రయంతోనే… ఎల్వీని నియమించారు. దానికి తగ్గట్లుగానే ఆయన పోలింగ్ రోజు.. డీజీపీ దృష్టి మళ్లించేందుకు… ప్రయత్నించారు. మొక్కలు నాటే పేరుతో… పోలీస్ చీఫ్ దగ్గరకు వెళ్లి.. ఆయనతో టైంపాస్ చేశారు. దీన్ని బట్టి చూస్తేనే.. ఎల్వీకి స్పష్టమైన ఎజెండా ఉందని తేలిపోతుంది.

వస్తామంటున్నారు కదా..! నెల ఆగలేరా…?

మే 23న కౌంటింగ్ జరుగుతుంది. గెలుపు మాదే అని… వైసీపీ నేతలు చాలెంజ్ చేస్తున్నారు. మే 26వ తేదీన ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అటు బీజేపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. వైసీపీ గెలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే… ఇద్దరికీ వైసీపీ గెలుస్తుందని.. జగన్ సీఎం అవుతారన్న క్లారిటీ ఉంది. కానీ.. అసలేం జరుగుతోంది..? ఈ నెల రోజుల్లోనే.. ఏదో చేయాలన్న కంగారను.. ఎల్వీ సుబ్రహ్మణ్యంలో కల్పిస్తున్నారు. ఆయన తనే సీఎం అన్నట్లుగా… చెలరేగిపోతున్నారు. అన్ని శాఖల్లోనూ వేలు పెట్టి.. ఐదేళ్లలో ఏమైనా తప్పులు చేశారేమో.. అని ఆరా తీయడానికే సమయం కేటాయిస్తున్నాయి. ఎంతగా అంటే.. చివరికి కేబినెట్ నిర్ణయాలను కూడా సమీక్షించే పరిస్థితి ఏర్పడింది. గెలుస్తామని అంత నమ్మకం ఉన్నప్పుడు… ప్రతీ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం… అధికారంతో పాటే వస్తుంది. అయినా ఎల్వీనే ఎందుకు పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు..?

నెలైనా పరోక్ష అధికారం అనుభవించాలనే తాపత్రయమా..?

నిజంగా గెలిచేస్తామని నమ్మకం ఉంటే.. ప్రభుత్వం విషయంలో.. ఇంత రచ్చ చేయరు. కేంద్రం … అండతో.. కనీసం నెల రోజుల పాటు అయినా.. పరోక్షంగా అధికారం చెలాయించాలనే తాపత్రయంతో… వైసీపీ.. ఎల్వీ సుబ్రహ్మణ్యంను… ఉపయోగించుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా అర్థం అవుతోంది. ఎల్వీ తీసుకునే నిర్ణయాలు.. చేస్తున్న హడావుడి కూడా అంతే ఉంది. ఇలా చేయడం వల్ల… మహా అయితే.. జగన్ గెలిస్తే… సీఎస్‌గా కొనసాగవచ్చు .. టీడీపీ గెలిస్తే.. తనను కొత్తగా చేసేదమీ ఉండదని ఎల్వీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబును సీఎంగా… ఎల్వీ పదిహేనేళ్లు చూశారు… కక్షసాధింపుల్లాంటివి చంద్రబాబు చేయరనే నమ్మకం ఉంది కాబట్టే.. నేరుగా ఆయనపైనే గురి పెట్టి .. అర్థం లేని రాజకీయం చేస్తున్నారు. వైసీపీ, బీజేపీ చేతిలో పావుగా మారారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆనందం… నెల రోజులు మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు. కానీ కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close