మీడియా వాచ్‌: ఈనాడులో గంద‌ర‌గోళం

తెలుగు మీడియా రంగంలో రారాజు.. ఈనాడు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల్ని దృష్టిలో ఉంచుకుని, త‌న‌ని తాను మ‌ల‌చుకోవ‌డంలో ఈనాడుకి తిరుగులేదు. ప‌దేళ్ల ముందుకెళ్లి ఆలోచించుకుని, అందుకు త‌గ్గ‌ట్టుగా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవ్వ‌డం ఈనాడు ప్ర‌త్యేక‌త‌. అయితే అలాంటి ఈనాడు ఖ్యాతి, ప్లానింగ్‌.. క‌రోనాతో ఘోరంగా దెబ్బ‌తింది.

క‌రోనా ఎఫెక్ట్ ఈనాడుపై బ‌లంగా ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 40 మంది ఈనాడు స్టాఫ్ క‌రోనా బారీన ప‌డిన‌ట్టు మీడియా సర్కిల్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సండే మ్యాగ‌జైన్ డెస్క్‌లో ప‌నిచేస్తున్న దాదాపు ఏడెనిమిది మంది స‌బ్ ఎడిట‌ర్లు క‌రోనాకి గుర‌య్యార్ట‌. ఇంచార్జ్‌తో స‌హా. దాంతో.. ఇప్పుడు డెస్క్ మొత్తం మూత‌బ‌డింది. దాంతో ఆ డెస్క్ బాధ్య‌త‌లు మ‌రొక‌రికి అప్ప‌గించారు. చాలా డెస్కుల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే ఇటీవ‌ల ఈనాడులో స్టాఫ్‌ని బాగా త‌గ్గించేశారు. సీనియ‌ర్ల‌కు సెటిల్‌మెంట్ చేసి, ఇంటికి పంపించేశారు. ఇంత‌కు ముందున్న స్టాఫ్‌లో దాదాపు 30 నుంచి 40 శాతం త‌గ్గిపోయారు. ఉన్న‌వాళ్ల‌లో చాలామంది క‌రోనా బారీతో ఇంటి వ‌ద్ద‌నే ఉండిపోయారు. ఇంకొంత‌మంది సెల‌వుల్లో ఉన్నారు. చాలామంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎలా చూసినా,.. ఈనాడులో ప‌నిచేసే స్టాఫ్ తగ్గిపోయారు. ఇద్ద‌రు ముగ్గురు స‌బ్ ఎడిట‌ర్లు చేయాల్సిన ప‌ని.. ఒక‌రిపై ప‌డుతోంది. ఎవ‌రు ఏ డెస్క్ ప‌ని చేయాలో, ఎవ‌రు ఏ బాధ్య‌త‌లు నిర్వ‌హించాలో తెలియ‌ని గంద‌రగోళం నెల‌కొంది.

ఈనాడులో ప‌నిచేసే ప్ర‌ముఖ కార్ట్యూనిస్ట్ శ్రీ‌ధ‌ర్‌కు క‌రోనా సోకింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దానికి తోడు గ‌త కొన్ని రోజులుగా శ్రీ‌ధ‌ర్ కార్టూన్‌లు ఈనాడులో క‌నిపించ‌డం లేదు. ఇదీ సంగ‌తి పేరుతో ప్ర‌ధాన పేజీలో ఆయ‌న కార్టూన్ వేస్తారు. అవి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. శ్రీ‌ధ‌ర్ లేక‌పోతే మ‌రో ప్ర‌త్యామ్నాయం లేదు. కార్టూన్ లేకుండా పేప‌ర్ ని తీసుకొస్తారు త‌ప్ప‌, మ‌రొక‌రికి ఆ బాధ్య‌త అప్ప‌గించ‌రు. శ్రీ‌ధ‌ర్ కోలుకునేంత వ‌ర‌కూ కార్టూన్ లేకుండా పేప‌ర్‌ని వ‌ద‌లాలా, లేదంటే.. మ‌రో ఆప్ష‌న్‌ని చూసుకోవాలా? అనేది తెలీని సందిగ్థం యాజ‌మాన్యంలో ఉంది.

జిల్లా ఎడిష‌న్లు లేకుండానే ఈనాడు పేప‌ర్ వ‌స్తోంది. సిబ్బంది లేక‌పోవ‌డం, యాడ్లు లేక‌పోవ‌డంతో ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌న్న మిష‌తో జిల్లా ఎడిష‌న్ల‌ను ఆపేశారు. ఈనాడు అనే కాదు.. చాలా ప్ర‌ధాన ప‌త్రిక‌లు టాబ్లాయిడ్ ల‌ను ప‌క్క‌న పెట్టాయి. న‌మ‌స్తే తెలంగాణ ఒక్క‌టే ఇప్పుడు జిల్లా పేజీల్ని తీసుకొస్తుంది. ఈనాడు కూడా టాబ్లాయిడ్ ల‌ను పున‌రిద్ధ‌రించాల‌ని ఈనాడు భావించింది. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్టిలో ఉంచుకుని ఆ ప్ర‌తిపాద‌న విర‌మించుకుంది. ఈనాడు నుంచి జిల్లా పేజీల‌ను చూడ‌డం దాదాపుఅసాధ్య‌మే అని మీడియా వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : జగన్‌ మెడకు ఈశ్వరయ్యను చుడుతున్న ఆర్కే..!

న్యాయవ్యవస్థపై జగన్ చేస్తున్న దాడిని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు... ఆంధ్రజ్యోతి ఆర్కే చేస్తున్న ప్రయత్నానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య ఆయుధాన్ని అందించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై పోరాటం చేస్తున్న దళిత జడ్జి...

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

ట‌బుని ఒప్పించ‌డం సాధ్య‌మా?

కొన్ని క‌థ‌ల్ని రీమేక్ చేయ‌డం చాలా క‌ష్టం. ఆ ఫీల్ ని క్యారీ చేయ‌డం, ఆ మ్యాజిక్‌ని మ‌ళ్లీ రీ క్రియేట్ చేయ‌డం సాధ్యం కాదు. కొన్నిసార్లు.. పాత్ర‌ల‌కు స‌రితూగే న‌టీన‌టుల్ని వెదికి...

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

HOT NEWS

[X] Close
[X] Close