సంతోష్ శోభన్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. మానస వారణాసి హీరోయిన్. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 14న విడుదల చేస్తున్నారు. ఈరోజు ట్రైలర్ బయటకు వచ్చింది. జీవితంలో ఎలాంటి హోప్ లేని ఒక కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తే, పెళ్లికి ముందే ఇద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటే… వాళ్లిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే సున్నితమైన అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ లో కొన్ని సెన్సిబుటిటీస్ బాగా క్యాప్చర్ అయ్యాయి అనిపించింది. ముఖ్యంగా సంతోష్ శోభన్ చెప్పిన కొన్ని డైలాగుల్లో.. ఆ పాత్ర తాలుకు పెయిన్ ప్రేక్షకుల గుండెల్ని తాకే అవకాశం ఉంది.
ట్రైలర్ చివర్లో ఓ డైలాగ్ ఉంది. ప్రేమంటే అవసరం, ఎంపిక కాదు… అది తలరాత.. అనే మాట ఈ కథ తాలుకూ ఆత్మని ఆవిష్కరించింది. సంతోష్ – మానస మధ్య కెమిస్ట్రీ బాగుంది. మానస క్యారెక్టర్ని కూడా చాలా స్ట్రాంగ్ గా తీర్చిదిద్దినట్టు అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కథకు తగ్గట్టుగా కుదిరాయి. సంతోష్ మంచి నటుడు. కావాల్సిందల్లా… హిట్టు మాత్రమే. తమ్ముడు సంగీత్ శోభన్ విజయ పరంపర కొనసాగిస్తున్నాడు. సంతోష్ కూడా అదే దారిలో నడవాలంటే ఈ సినిమా హిట్టు కొట్టాలి. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. లవ్ స్టోరీ కాబట్టి.. యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
