ఇల్లు కొనాలనుకున్న వారు ఊరంతా తిరుగుతూ ఉంటారు.కానీ బిల్డర్లు అందరూ ఒకే చోట చేరి తమ ప్రాజెక్టులు ప్రదర్శించే చోటు క్రెడాయ్ ప్రాపర్టీషో. కొనకపోయినా పర్వాలేదు..కానీ చాలా విషయాలు.. ఊరంతా తిరిగినా తెలియని విషయాలు తెలుస్తాయి.
డాయ్ ప్రాపర్టీ షో 2026 మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతోంది. ఆదివారం వరకూ సాగే ఈ మెగా ఈవెంట్ ను పర్మనెంట్ హో జావో అనే ఆకర్షణీయమైన నినాదంతో నిర్వహిస్తున్నారు. అద్దె ఇళ్ల భారం నుంచి విముక్తి పొంది, హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరంలో సొంత గూడు ఏర్పాటు చేసుకోవాలని క్రెడాయ్ పిలుపునిస్తోంది. ఈ ప్రదర్శనలో 60 మందికి పైగా ప్రముఖ డెవలపర్లు తమకు చెందిన సుమారు 300 ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. కేవలం నివాస గృహాలే కాకుండా విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ప్లాట్లు ,కమర్షియల్ స్పేస్‌లు వంటి విభిన్న రకాల ఆప్షన్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.
వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు, ఈ ప్రదర్శనలో కేవలం తెలంగాణ రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు ఎటువంటి భయం లేకుండా తమకు నచ్చిన ప్రాపర్టీని ఎంచుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టుల వివరాలతో పాటు, గృహ రుణాల కోసం ప్రముఖ బ్యాంకులు కూడా ఇక్కడే తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. తక్కువ వడ్డీ రేట్లు, స్పాట్ లోన్ ఆఫర్లతో సందర్శకులకు ఆర్థిక సలహాలను కూడా అందిస్తున్నాయి.
శని, ఆదివారాలు సెలవు ది రోజులు కావడంతో సందర్శకుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. ఒకే చోట వందలాది ప్రాజెక్టులను పోల్చి చూసుకునే వీలుండటంతో ఇల్లు కొనే ప్లాన్ ఉన్న వారికి .. వాటి గురించి తెలుసుకునే అవకాశం ఒక్క చోటే లభిస్తోంది.
