చైతన్య : రిటైరయ్యే సీఎస్, డీజీపీలు సీఎంలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..కేంద్రంలోనూ కీలక పదవుల్లో ఉన్న వారి పదవీ కాలం పూర్తి కాగానే ఓ మంచి పదవిని వారి కోసం ప్రభుత్వాలు రెడీ చేస్తున్నాయి. చీఫ్ జస్టిస్ గా పని రంజన్ గోగొయి పార్లమెంట్ సభ్యుడయ్యారు. మరో న్యాయమూర్తి గవర్నర్ అయ్యారు. ఇక అధికారుల గురించి చెప్పాల్సిన పని లేదు. కేంద్రంలో రిటైరవుతున్న వారికి చాలా మందికి పదవులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువ. రిటైరయ్యే ప్రతీ సీఎస్, డీజీపీకి పదవి రెడీగా ఉంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో రిటైరయ్యే ఉన్నతాధికారులందరికీ పదవులు

తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చీఫ్ అడ్వయిజర్ అయ్యారు. పట్టుబట్టి ఆయన ఈ పదవి సాధించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో సీఎస్ గా పని చేసిన రాజీవ్ శర్మ కూడా సలహాదారుగా సీఎంవోలోనే ఉన్నారు. తెలంగాణ రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా కేబినెట్ హోదాతో ఓ పదవి ప్రకటించబోతున్నారని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీగా పని చేసిన నీలం సాహ్ని పదవి కాలాన్ని వీలైననన్ని సార్లు పొడిగించిన సీఎం జగన్.. రిటైరవగానే .. అత్యంత కీలకమైన ఎపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. మరో సీఎస్ ఆదిత్యనాత్ దాస్‌కి రిటైరవ్వగానే ఢిల్లీలో ఐదారు లక్షల జీతంతో ఓ సలహాదారు పోస్ట్ ఇచ్చారు. అలాగే డీజీపీ రిటైరవ్వక ముందే బలవంతంగా రిటైర్ చేయించి మరీ గౌతం సవాంగ్‌కు ఎపీపీఎస్సీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. అంతకు ముందు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత అవమానకరంగా బయటకు పంపేశారు. ని తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ చెప్పినట్లుగా చేసి ఉంటే మాత్రం ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఇప్పుడు అడ్వయిజర్‌గా ఉండేవారనడంలో సందేహం లేదు.

సీఎంలు ఇష్ట ప్రకారం ఇస్తున్నారా ? అధికారులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

ఇలా సీఎస్ గా లేదా డీజీపీగా రిటైరవుతున్న వారికి పదవులు ఎలా ఇస్తున్నారన్నది పెద్ద సస్పెన్స్. నిజానికి సీఎంలు ఇవ్వడం లేదని.. ఇవ్వాల్సిన పరిస్తితిని వారే కల్పిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ అధికారుల తీరు అనేక విమర్శలకు కారణం అవుతోంది. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఎం.. ఆయన కుటుంబం లేదా వ్యాపార సన్నిహితులకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. సీఎస్‌లు, డీజీపీలుగా ఉన్న వారు.. ముఖ్యమంత్రుల రాజకీయ ప్రయోజనాలు కాపాడటానికి నిబంధనలు ఉల్లంఘిస్తారు. ఆ కిటుకులు.. స్కాంలు అన్నీ వారికి తెలుసు. ఇప్పుడు కనుక వారిని బయటకు వదిలేస్తే అంతకు మించిన డ్యామేజ్ చేస్తారన్న భయం ముఖ్యమంత్రుల్లో ఉందని చెప్పుకోవచ్చని అంటున్నారు. గత పదేళ్ల కాలంలో చీఫ్ సెక్రటరీలు, డీజీపీలుగా పని చేసిన వారి ట్రాక్ రికార్డు చూస్తే… వారిపై వచ్చే ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వంలో నిగూఢంగా జరిగే వ్యవహారాలు మొత్తం వారికి తెలిసే జరుగుతాయి. అందుకే వారికి ఏదో ఓ ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వాధినేతలు అనుకుంటున్నారు.

అడిగిన పదవులు ఇవ్వకపోతే ఏమవుతుందో చంద్రబాబు అనుభవాలే ఉదాహరణ !

ఇలా సీఎస్ లు, డీజీపీలుగా పని చేసిన వారికి పదవులు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చంద్రబాబు అనుభవాలే ఉదాహరణ. కొత్త రాష్ట్రం తొలి సీఎస్ గా నియమితులైన ఐవైఆర్ కృష్ణారావుకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన రిటైరైన తర్వాత ఆయన కోరిక మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. ఆ నిధులతో ఐవైఆర్ చేయాలనుకున్నది చేశారు. కానీ ఆయన టీటీడీ చైర్మన్ పోస్టు ఆశించారు. ఇవ్వకపోతే సరికి ఆయనకు వ్యతిరేకమయి… తాను సీఎస్ గా ఉండగా తీసుకున్న అమరావతి రాజదాని అంశాన్ని వైసీపీ వ్యూహాలకు అనుగుమంగా కులపరం చేశారు. దాని వల్ల టీడీపీకి జరిగిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఆయనే కాదు మరో సీఎఎస్‌గా పని చేసిన అజేయ కల్లం అలియాస్ కల్లం అజేయరెడ్డి కి.. రిటైరైన తర్వాత ఎలాంటి పదవులు ఇవ్వకపోవడం.. కనీసం పొడిగింపు కూడా ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీ కోసం లేనిపోని ప్రచారాలు చేశారు. విద్యుత్ ఒప్పందాల మీద.. ఇతర విషయాల మీద అజేయకల్లాం చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో చీఫ్ అడ్వయిజర్ గా చేరారు. లక్షల జీతం తీసుకుంటున్నారు. తాను టీడీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణనలు నాలుగేళ్లలో నిరూపించలేకపోయారు. కానీ ఆయనకు మాత్రం లబ్ది కలిగింది.

అంటే రాజకీయ నాయకులను మించి ఈ అధికారులు రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయాలు వారి ముందు దిగుడుపే. ముందు ముందు ఈ అధికారులే రాజకీయ నాయకుల్ని ఓ ఆటాడించినా ఆశ్చర్యం లేదనే పరిస్థితి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close