మోడీ మేనియాలో దేశం మొత్తం ఉర్రూతలూగిపోతోంది. మోడీ తీసుకున్న ఏ నిర్ణయాన్ని విమర్శించినా మోడీ అభిమానులు విరుచుకుపడిపోతున్నారు. అదే సందర్భంలో మోడీ నిర్ణయాన్ని సమర్ధించినవాళ్ళకు మాత్రం జేజేలు పలుకుతున్నారు. ఈ ట్రెండ్‌ని క్యాష్ చేసుకోవడానికి సినిమా హీరోలందరూ కూడా రెడీ అయిపోతున్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆహా…ఓహో…అద్భుతః అని తమ క్రియేటివ్ స్కిల్స్ అన్నింటినీ వాడేస్తూ పొగిడేస్తున్నారు. మీడియాలో సూపర్బ్ కవరేజ్‌తో పాటు మోడీ అభిమానుల ప్రశంశలు…అలాగే నేను నల్ల నరకాసురుడ్ని కాదు అన్న సర్టిఫికెట్‌ని కొట్టేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, మహేష్‌బాబు, నాగార్జున, బాలీవుడ్ ఖాన్స్ అందరిదీ ఇదే స్టైల్.
అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోస్ అందరికీ ఓ సినిమా డైరెక్టర్ నుంచే సూపర్ కౌంటర్ డైలాగ్ వచ్చింది. తమిళ్ డైరెక్టర్ అమీర్ సుల్తాన్ ఆ అస్త్రాన్ని సంధించాడు. తమిళుడు కాబట్టి రజినీకాంత్ పేరును ప్రస్తావిస్తూ ప్రశ్నించాడు. అలాగే పవన్ కళ్యాణ్‌ని కూడా ఈ ఇష్యూలోకి లాగాడు. కానీ ఈ ప్రశ్న నోట్ల రద్దుని ప్రశంసించిన స్టార్ హీరోస్ అందరికీ వర్తిస్తుంది. నోట్ల రద్దుని ప్రశంసింస్తున్న స్టార్ హీరోస్ అందరూ కూడా బ్లాక్ మనీ నుంచి భారతదేశానికి విముక్తి లభించేసినట్టే అనే రేంజ్లో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. మరి ఈ స్టార్ హీరోస్ సినిమాల టికెట్స్ అన్నీ కూడా మొదటి వారాంతం మొత్తం బ్లాక్‌లో అమ్ముడుపోతాయని వీళ్ళకు తెలియదా? నిజంగా దేశం నుంచి బ్లాక్ మనీ పోవాలన్న చిత్తశుద్ధి వీళ్ళకు ఉండి ఉంటే ఆ బ్లాక్ టికెట్స్ దందాకు ఫుల్ స్టాప్ పెట్టగలరా? నిర్మాత, డైరెక్టర్, హీరోయిన్….ఇలా వాళ్ళ సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఈ స్టార్ హీరోస్‌దే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. మరి ఈ పవర్ స్టార్, సూపర్ స్టార్…ఇంకా ఇతర స్టార్స్ అందరూ కూడా బ్లాక్‌లో సినిమా టికెట్స్ అమ్మే విధానానికి స్వస్తి పలుకుతారా? నోట్ల రద్దు విషయాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించి ఉంటే….బ్లాక్ మనీ నుంచి భారతదేశం విముక్తురాలవ్వాలన్న చిత్తశుద్ధి ఈ స్టార్ హీరోస్‌కి ఉంటే ఈ బ్లాక్ టికెట్స్ దందాను నిర్మూలించమనండి. అమీర్ సుల్తాన్ అడిగి ప్రశ్న, చేసిన విమర్శలో న్యాయం ఉంది. ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా అని నాలుగు సినిమాటిక్ డైలాగులు ట్వీట్ చేయడం కాదు. బ్లాక్ టికెట్స్ దందాను అడ్డుకుంటే అప్పుడు నిజమైన హీరోలనిపించుకుంటారు. మన స్టార్స్‌కి అంత సీన్ ఉందా?