ఆ ఇద్దరు డైరెక్టర్స్‌లో ఎవరు తారక్?

జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే ఎన్టీఆర్‌ని కన్ఫ్యూషన్‌లో పడేసినట్టుంది. దాంతో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత టైంని ఇప్పుడు కథలు వినడంపైనా, డైరెక్టర్స్‌తో మీటింగ్స్ పైనా స్పెండ్ చేస్తున్నాడు తారక్. చాలా మంది డైరెక్టర్స్ దగ్గర కథలు విన్నాడు. వక్కంతం వంశీ నుంచి అనిల్, చందూ మొండేటిల వరకూ అందరి కథలూ విన్నాడు. కానీ ఏ ఒక్క కథను కానీ, డైరెక్టర్‌ని కానీ ఫైనల్ చేయలేకపోయాడు. తారక్‌కి కథలు చెప్పిన మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఏదో ఒక సినిమాకు కమిట్ అయిపోయారు. సురేందర్‌రెడ్డి, చందూ మొండేటిల తర్వాత సినిమాలు కూడా ఫిక్స్ అయ్యాయన్న వార్తలు వస్తున్నాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌కి మిగిలిన ఆప్షన్స్ ఇద్దరే. అన్నయ్య కళ్యాణ్ రామ్‌కి పటాస్‌లాంటి హిట్ సినిమా ఇచ్చిన అనిల్, తనకు ఆదిలాంటి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని ఇచ్చిన వినాయక్. అదుర్స్‌-2 సినిమా గురించి వినాయక్‌తో ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నాడు తారక్. వినాయక్ కూడా కొంతమంది రైటర్స్ చేత అదుర్స్ సీక్వెల్ కథపైన వర్క్ చేయించాడు. ఇక అనిల్ రావిపూడికి ఎన్టీఆరే ఒక లైన్ చెప్పాడని తెలుస్తోంది. ఆ లైన్‌ని ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పూర్తిగా డెవలప్ చేశాడట అనిల్. ప్రస్తుతం ఎన్టీఆర్‌కి ఉన్నదే ఈ రెండు ఆప్షన్స్ అయినప్పుడు మనవాడు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నట్టు? ఏం ఆలోచిస్తున్నట్టు? తన నెక్ట్స్ సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేయాలని అనుకుంటున్నట్టు? ఫిజిక్ విషయంలో కూడా ఎన్టీఆర్‌లో చాలా మార్పులు వచ్చాయి. అలాగే యంగ్ హీరోస్ అందరికంటే ఫాస్ట్‌గా సినిమాలు చేసే ఎన్టీఆర్ ఆ సారి మాత్రం తన ఆలోచనలను మార్చుకున్నట్టున్నాడు. కారణమేంటి అని చాలా ఊహాగానాలు, గాసిప్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటన్నింటికీ ఎన్టీఆర్ ఎప్పుడు చెక్ చెప్తాడో…సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close