దీపావళి ఉత్సవాల తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆకాశం మంచు కప్పినట్టుగా మారింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారిన ఈ పరిస్థితి వల్ల ప్రపంచంలోనే అత్యంత పొల్యూషన్‌తో బాధపడుతున్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలోకి వచ్చింది. చైనా రాజధాని బీజింగ్‌లోనూ 2013లో ఇదే పరిస్థితి ఉండేది. ఒకప్పుడు పొల్యూషన్ రాజధానిగా బీజింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఢిల్లీ అలాగే ఉంది.. కానీ బీజింగ్ మాత్రం.. సూపర్ క్లీన్ అయిపోియంది.
ఢిల్లీ పొల్యూషన్ – ఒక విషాదకరమైన వాస్తవం
దీపావళి రోజు తర్వాత ఢిల్లీ AQI 520కి పైగా చేరి, ‘ప్రమాదకరక’ర స్థాయిని తాకింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 50 రెట్లు ఎక్కువ. వాహనాలు , పంటలు కాల్చడం , పారిశ్రామిక ఉద్గారాలు, రోడ్ డస్ట్ , కోల్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలు. ఇది వేలాది మరణాలకు, శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తోంది. ఎప్పటికప్పుడు తాత్కలిక చర్యలు తీసుకుంటున్నారు కానీ .. దాని వల్ల వచ్చే ప్రయోజనాలు శూన్యం. పొల్యూషన్ ను చూపించి రాజకీయాలు చేస్తున్నారు కానీ.. పరిష్కారాలు మాత్రం వెదకడంలేదు.
బీజింగ్: పొల్యూషన్‌తో పోరాటంలో విజయం
2013లో బీజింగ్ ‘పొల్యూషన్ క్యాపిటల్’గా ప్రపంచం అంతా గుర్తించింది. AQI 500+ చేరి, ‘స్మాగ్ క్యాపిటల్’ అనే పేరు పొందింది. పదేళ్లలో చైనా ప్రభుత్వం అక్కడి పరిస్థితిని మార్చేసింది. పొల్యూషన్ పై యుద్ధం ప్రకటించి.. ఇప్పుడు క్లీన్ సిటీగా మార్చేసింది. నష్టమైనా..కష్టమైనా గట్టి చర్యలు తీసుకుంది. కొత్త కోల్ ప్లాంట్ల నిషేధించి.. 1,200 ఫ్యాక్టరీల మూసివేసింది. పాత వాహనాలు తొలగించడం, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సహం, పారిశ్రామిక కాలుష్య పరిశ్రమల్ని మూసివేయడం వంటి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలు 1,00,000కి పైగా జీవితాలను కాపాడాయని యూనివర్సిటీ ఆఫ్ చికాగో రిపోర్ట్ తెలిపింది. చైనాకు మాత్రమే ఇలాంటి విజయం సాధ్యమవుతున్నట్లుగా పోరాడారు.
బీజింగ్ తరహాలో చేయలేం కానీ ప్రయత్నించలేమా ?
బీజింగ్ ను చైనా ప్రభుత్వం పట్టుబట్టి క్లీన్ గా మార్చుకుంది. ఇందు కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంది. నష్టపోయేవారికి ప్రత్యామ్నాయాలు చూపించింది. దీనికి అక్కడి ప్రభుత్వానికి ఎదురు చెప్పేవారు లేరు. కానీ మన దేశంలో రాజకీయవ్యవస్థ ఏ పనీ ముందుకు సాగనివ్వదు. చైనాతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే ఢిల్లీని క్లీన్ గా ఉంచుకోవచ్చు.. కానీ దానికి తగ్గ రాజకీయ సంకల్పం ఉండటమే కష్టం. “పొల్యూషన్ ప్రాబ్లమ్ కాదు, పాలసీ ప్రాబ్లమ్” అని నిపుణులు కూడా నిర్వేదంలో ఉన్నారు. మారితేనే ఢిల్లీకి భవిష్యత్ ఉంటుంది.