బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి. పేరొందిన కంటెస్టెంట్స్ లేకపోయినప్పటికీ బిగ్ బాస్ మిగతా భాషల రికార్డులు కూడా బద్దలు కొడుతూ ఈ సీజన్ దూసుకెళ్తుండం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. మొదటి రెండు వారాలు సూర్యకిరణ్ , కరాటే కళ్యాణి నిష్క్రమించిన తర్వాత ఈ వారం టీవీ9 దేవి బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించింది. అయితే దేవి నిష్క్రమణ కు జనాల్లో టీవీ9 మీద ఉన్న వ్యతిరేకత కూడా ఒక కారణం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
టీవీ9 పై ప్రజల్లో వ్యతిరేకత:
 
టీవీ9 సంవత్సరాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఆ ఛానల్ పై ప్రజలలో కాస్త వ్యతిరేకత మొదటినుండి ఉంది. తమ ఎజెండాని ప్రజలపై రుద్దడం, అధికారంలో ఉన్న పార్టీ లకు అనుగుణంగా ఉంటూ ప్రజలలో ఉన్న నిజమైన అభిప్రాయాలను తొక్కిపెట్టడం వంటి కారణాలతో ప్రజల్లో ఈ ఛానల్ పై వ్యతిరేకత ఉంది. అయితే క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడం, ఈ ఛానల్ కి పోటీ ఇచ్చే స్థాయి లో మిగతా చానల్స్ ఎదగలేక పోవడం వంటి కారణాలతో ఆ చానల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. దేవి నాగవల్లి బిగ్ బాస్ షో లో అడుగు పెట్టిన మొదటి రోజు నే, ” హేమ అక్క ని పంపినట్లుగా ఈమెను కూడా మొదటివారంలోనే పంపి చేద్దాం బ్రదర్” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొట్టడం టీవీ9 నుండి వస్తున్న కంటెస్టెంట్స్ పై కొందరు ప్రజలలో ఉన్న వ్యతిరేకత కి నిదర్శనం
టీవీ9 పై వ్యతిరేకత దేవి కి ప్రతికూలంగా మారనుందని గ్రహించిన టీవీ 9 యాంకర్స్ ప్రత్యూష, నేత్ర ల స్పెషల్ వీడియో:
అయితే దేవి నాగవల్లి మొదటి రెండు వారాలు నామినేషన్ లోకి రాలేదు. దాంతో ఆమె హౌస్ లో కంటిన్యూ అయింది. అయితే కరాటే కళ్యాణి వెళ్లిపోతూ బిగ్ బాంబ్ దేవిపై వేయడంతో ఆమె నామినేషన్ లోకి ఈ వారమే మొదటిసారి వచ్చింది. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న అభిప్రాయాలు తమదాకా చేరడంతో టీవీ9 యాంకర్స్ అయినటువంటి ప్రత్యూష, నేత్ర లు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలారు. దేవి కి  మద్దతుగా వారు మాట్లాడుతూ, టీవీ9 లో తాము చదివే వార్తలు, అభిప్రాయాలు తమ సొంత అభిప్రాయాలు కావని, ఎడిటోరియల్ టీం ఇచ్చినది మాత్రమే తాము చదువుతామని, ఆ వార్తల ఆధారంగా దేవి పై ప్రేక్షకులు నిర్ణయం తీసుకోరాదని టీవీ9 యాంకర్స్ ప్రత్యూష ,నేత్ర కోరడం చూస్తుంటే టీవీ9 పట్ల జనాల్లో ఉన్న వ్యతిరేకత దేవి కి వ్యతిరేకంగా మారనుందని వారు ముందే ఊహించినట్లుగా అర్థమవుతోంది.
దేవి దాసరి కి మనవరాలు అవుతుందంటూ దేవి తల్లి గారి ఇంటర్వ్యూ:
 
టీవీ9 పై జనాల్లో చాలామందిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఒక వర్గం లో ఈ వ్యతిరేకత మరింత ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. తమ వర్గానికి చెందిన వారు రాజకీయ పార్టీలు పెట్టినప్పుడల్లా టీవీ9 వారికి వ్యతిరేకంగా విషం కక్కిందని, తమ వర్గం వారిని కించపరిచే అజెండాతో టీవీ9 సాగిందని ఆ వర్గం లో బలమైన అభిప్రాయం ఉంది. అయితే ఇటీవల దేవి తల్లి గారి ఇంటర్వ్యూ లో, దర్శకులు దాసరి నారాయణరావు దేవికి వరుసకు తాత అవుతారని, ఆయన దేవి ని ఎంతగానో ప్రోత్సహించారని ఆవిడ వివరించారు. అదేవిధంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో దేవి కి మంచి అనుబంధం ఉందంటూ రెండు మూడు రోజుల కిందట ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అయితే టీవీ9 పట్ల ఒక వర్గంలో ఉన్న వ్యతిరేకత దేవి కి ప్రతికూలంగా మారకూడదని ఈ ఇంటర్వ్యూ , ఈ ఫోటోలు విడుదల అయ్యాయి అని సోషల్ మీడియాలో చర్చ నడిచింది.
దేవి కి ప్రతికూలంగా మారిన ఇతరత్రా అంశాలు:
నిజానికి మహిళల లో దేవి పట్ల సానుకూల అభిప్రాయమే ఉన్నప్పటికీ, ఈసారి బిగ్ బాస్ లో సోషల్ మీడియా స్టార్స్ ఎక్కువగా ఉండడం, సాధారణ ప్రేక్షకులకు వారు తెలియక పోయినప్పటికీ సోషల్ మీడియాలో వారికంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఉండటం, ఆ ఫాలోయర్స్ నుండి వారికి ఓట్లు బాగా వస్తూ ఉండడం మిగతా కంటెస్టెంట్స్ కి ప్రతికూలంగా మారింది. మెహబూబ్ ఏమీ ఆకట్టుకునేలా చేయక పోయినప్పటికీ మొదటి వారం సూర్య కిరణ్ ఎలిమినేట్ కావడానికి కూడా కారణం ఇదే. ఇప్పుడు మూడో వారం కూడా మెహబూబ్ దేవి కి మధ్య ఒక శాతం లోపే ఓట్ల తేడా ఉన్నట్లు తెలుస్తోంది.
మొదటి రెండు వారాలు నామినేషన్ లోకి రాకపోవడం కూడా దేవి కి ప్రతికూలంగా మారింది. గతంలో ఇదే తరహా తన పాటు అలీ రెజా కి జరిగింది.  అదెలాగో ఇక్కడ చదవండి:
సోషల్ మీడియా ఫాలోయింగ్ లేకపోవడంతో పాటు హౌస్ లో గిరిగీసుకుని రిజర్వ్డ్ గా ఉండడం కూడా తనకు ప్రతికూలంగా మారింది. అమ్మ రాజశేఖర్ ని తిడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఏడుస్తూ అమ్మ రాజశేఖర్ అడిగిన క్షమాపణలు దేవి పై ప్రేక్షకులలో వ్యతిరేకత తీసుకు వచ్చాయి.
మొత్తం మీద, గత సీజన్లో టీవీ 9 జాఫర్ రెండో వారం నిష్క్రమిస్తే, టీవీ9 దేవి ఈసారి మూడో వారం నిష్క్రమించిన ట్లు అయింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close