మా సినిమాని పైరసీ చేస్తున్నారు, దొంగతనంగా చూసేస్తున్నారు అని అరిచి కేకలు పెట్టే సినిమావాళ్ళు… వేరే వాళ్ళ క్రియేటివిటీని మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా కాపీ పేస్ట్ చేసేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. తొలిప్రేమ, ఛత్రపతి, బిజినెస్ మేన్లాంటి సినిమాల సక్సెస్‌కి ఆ సినిమాలలో ఉన్న సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకూ కారణం. కానీ మణిశర్మ, కీరవాణి, థమన్లాంటి అగ్రశ్రేణి సంగీత దర్శకుల క్రియేటివిటీ అని చెప్పి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ అవుట్ పుట్ మొత్తం కూడా వాళ్ళ ఒరిజినల్ కాదని, కాపీ కొట్టేశారని తెలిసిన తెలుగు సినిమా లవర్స్ అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన నేపథ్యంలో ఇప్పుడిక అలాంటి దొంగతనాలను దాచడం ఎవ్వరికైనా చాలా కష్టం. అయినప్పటికీ మన సినిమా వాళ్ళు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
లెటెస్ట్‌గా రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150 టీజర్లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెగా ఫ్యాన్స్‌కి బాగానే నచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చే ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సల్మాన్ ఖాన్ హిందీ సినిమా ‘సుల్తాన్’ నుంచి ‘ఖైదీ నంబర్ 150’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని కాపీ కొట్టేశాడు దేవి. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న వీడియో చూసిన ఎవ్వరికైనా ఈ విషయం స్పష్లంగానే తెలిసిపోతోంది. టాలెంట్ లేని వాళ్ళు, కష్టడడం చేతకాని వాళ్ళు కాపీ కొట్టి బ్రతికేయడం ఒకె కానీ దేవిశ్రీ ప్రసాద్ లాంటి సూపర్ మల్టిపుల్ టాలెంటెడ్, క్రియేటివ్ రైటర్ అండ్ సూపర్బ్ హార్డ్ వర్కర్ అయిన దేవిశ్రీప్రసాద్ కూడా కాపీ పేస్ట్ మార్గాన్ని ఎంచుకోవడం మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకే అవమానకరమేమో. బాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ హిట్స్‌కి మ్యూజిక్ కంపోజ్ చేసిన దేవీ ఈ రూట్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు కానీ దేవీ స్థాయికి మాత్రం ఇది తగని పని.