ఇంతకాలం తన బాణీలతో అలరించిన దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు కెమరా ముందుకు వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్గా ట్రెండ్స్ సెట్ దేవి, ఈసారి తన లోపల దాగున్న నటుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బలగం వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మతో హీరోగా పరిచయం అవుతున్నారు దేవి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్. ఎల్లమ్మ సినిమా ఎలా ఉండబోతుందో ఈ గ్లింప్స్ హింట్ ఇచ్చింది.
సుడిగుండలా తిరుగుతున్న గాలిలో.. ఓ వేపాకు ప్రయాణం..కాళ్లకు గజ్జెలు మోగుతూ ఇద్దరు వ్యక్తుల పరుగు, వేపాకు మేఘాలను దాటి పైకి ఎగసి, క్షణాల్లో అమ్మవారి రూపంగా మారడం, ఆకాశం నుంచి వర్షం, తడిచిన రెక్కలను విదిలిస్తూ మేక ఒక్కసారిగా కదలడం.. ఇవన్నీ ఎల్లమ్మ కథపై ఆసక్తిని పెంచాయి.
దేవి లుక్ కూడా సర్ప్రైజ్ చేసింది. తుఫాను, చెట్టుకుఆనించి ఉన్న కొడవలి, ఒంటి మీద చొక్కా లేకుండా, నడుముకు డోలు కట్టుకొని రాయిపై కూర్చుని దేవి చూసిన ఓ చూపు చాలా ఎట్రాక్టివ్ గా వుంది. ఇందులో తన పాత్ర పేరు పర్షి. పొడగాటి జట్టులో తను కనిపించిన తీరు తొలి చూపులోనే క్యారెక్టర్ లో లీనం చేసేలా వుంది. ఈ సినిమాకి దేవినే మ్యూజిక్ ఇవ్వడం మరో విశేషం.
