తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా వెర్సటైల్ యాక్టర్ ధనుష్, అందాల నటి మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న ధనుష్, కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో మృణాల్తో ఆయన పేరు ముడిపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు సెలబ్రిటీలు వెంటనే స్పందించి ఖండిస్తుంటారు. అయితే, ధనుష్ గానీ, మృణాల్ గానీ ఈ వార్తలపై ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. గతంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగినప్పుడు తాము ఫ్రెండ్స్ మాత్రమే అన్నారు. ఇప్పుడు ఏకంగా పెళ్లి ముహుర్తం ఖరారు అయిందని ప్రచారం చేస్తున్న స్పందించడం లేదు.
మృణాల్ ఠాకూర్ సీతా రామం సినిమాతో సౌత్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. మౌనం అర్థాంగీకారం అన్నట్లుగా వీరి నిశ్శబ్దం చూస్తుంటే, త్వరలోనే ఒక శుభవార్త వినే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, కోలీవుడ్ స్టార్ హీరో మరోసారి బాలీవుడ్ భామను వివాహం చేసుకున్నట్లవుతుంది. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో సూర్య, ఆర్య వంటి వారు ఇతర భాషల నటీమణులను వివాహం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
