ధ‌నుష్‌ థ్రిల్లింగ్‌ పెర్ఫామెన్స్‌తో `మ‌రియ‌న్‌` బాక్సాఫీస్ హిట్ సాధించింది

ధనుష్‌ హీరోగా, పార్వతీ మీనన్‌ హీరోయిన్‌గా భరత్‌బాల దర్శకత్వంలో ఆస్కార్‌ ఫిలింస్‌ ప్రై. లి. పతాకంపై ప్రముఖ నిర్మాత ఆస్కార్‌ వి. రవిచంద్రన్‌ తమిళంలో నిర్మించిన ‘మరియన్‌’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సి.జె.శోభ ఇప్పుడు ఎస్‌.వి.ఆర్‌.మీడియా ప‌తాకంపై మరో విభిన్న చిత్రం ‘మరియన్‌’ను తెలుగులో అందించారు. నవంబర్‌ 20న రిలీజైన ఈసినిమా థియేట‌ర్ల‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ధ‌నుష్ మైండ్‌బ్లోవింగ్ పెర్ఫామెన్స్‌, ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం ఈ సినిమాకి పెద్ద అస్సెట్ అయ్యాయ‌ని చెబుతున్నారు నిర్మాత శోభ‌.

స‌క్సెస్‌ సందర్భంగా నిర్మాత సి.జె.శోభ మాట్లాడుతూ – ”మా ఎస్వీఆర్‌ మీడియా బ్యానర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాం. ఇప్పుడు ‘మరియన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాం. ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకునే ధనుష్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ చేసి మెప్పించారు. ధనుష్‌ పెర్ఫామెన్స్‌కి అద్భుత స్పందన వస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ అందించిన సంగీతం స్పెషల్‌ హైలైట్‌ గా నిలిచింది. ఒక యదార్థ సంఘటన ఆధారంగా భరత్‌బాల రూపొందించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతోంది. తమిళ్‌లో ఆస్కార్‌ రవిచంద్రన్‌గారు నిర్మించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి అంతే చక్కని స్పందన వచ్చింది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close