బీజేపీ పరిస్థితి బాగోలేదనే సర్వేలేమీ బయటకు రాలేదా..!?

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల ఏడో తేదీన వస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ ఎన్నికల ప్రచారసభలో హింట్ ఇచ్చినా అది విపక్షాలను తప్పుదోవ పట్టించడానికేనని తేలిపోయింది. అయితే సాధారణంగా ఎన్నికలు జరిపే ముందు .. కొన్ని మీడియా సంస్థలు.. రెండు, మూడు నెలల పాటు సర్వేల పేరిట హడావుడి చేస్తాయి. ఈ సారి ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ ప్రముఖ మీడియా సంస్థలేవీ ఎలాంటి సర్వేలు ప్రకటించలేదు. సాధారణ ఎన్నికలైనా.. ఇతర రాష్ట్రాల ఎన్నికైనా… జాతీయ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ మీడియా సంస్థలన్నీ.. ఇతర పోల్ సంస్థలతో కలిసి సర్వేలు చేసి.. ప్రజల మీదకు వదిలేవి. అవి నిజమవుతాయో.. అబద్దమవుతాయో తెలియదు కానీ.. ఓ అంచనాకు ప్రజలు రావడానికి ఉపయోగపడేవి.

ఈ సారి మాత్రం ఎలాంటి సర్వేలు విడుదల చేయలేదు. ఇప్పుడు విడుదల చేయడానికి అవకాశం లేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చు కానీ.. సర్వేలు ప్రకటించడానికి లేదు. ఎందుకు ఈ మీడియా సంస్థలు సర్వేలు చేయలేదనేది ఇప్పుడు చర్చనీయాంశమయింది. బీజేపీకి గడ్డు పరిస్థితి ఉందని.. ఆ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావు కాబట్టే.. సర్వేలు చేయలేదనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అసోంలో అధికార వ్యతిరేకత ఇబ్బందికరంగా మారింది. బెంగాల్‌లో పుంజుకున్నా అధికారం అందుకుంటారని ఎవరూ నమ్మలేకపోతున్నారు.

ఇక పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ క్రమంలో బీజేపీకి పాజిటివ్ ఫలితాలు రావు కాబట్టే… సర్వేలను మీడియా సంస్థలన్నీ లైట్ తీసుకున్నాయని చెబుతున్నారు. పరిస్థితి చూస్తే అంతే ఉంది. గతంలో హోరెత్తించిన సర్వే సంస్థలు .. తమ ప్రధానమైన పనిని మానేసి సైలెంట్ గా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సాగర్‌లో కేసీఆర్ సభ ఉంటుందా..?

నాగార్జున సాగర్‌లో గెలవడానికి గతంలో చేసిన తప్పులు చేయకూడదని అనుకుంటున్న కేసీఆర్... బహిరంగసభ పెట్టి ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారు. పధ్నాలుగో తేదీన సభ నిర్వహణకు ఏర్పాట్లు కూడా...

క్రైమ్ : హోంగార్డు భార్య మర్డర్ “మిస్‌ఫైర్”

చేతిలో తుపాకీ ఉంది. ఎదురుగా చంపేయాలన్నంత కోపం తెప్పించిన భార్య ఉంది. అంతే ఆ ఆ పోలీసు ఏ మాత్రం ఆలోచించలేదు. కాల్చేశాడు. తర్వాత పోలీస్ బుర్రతోనే ఆలోచించారు. తుపాకీ మిస్ ఫైర్...

పవన్‌ది అసంతృప్తి క్వారంటైనా..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనూహ్యంగా తాను క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లుగా ప్రకటించారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి వైరస్ సోకిందని అందుకే తాను.. వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లుగా సందేశం...

వివేకా కేసులో మళ్లీ వచ్చిన సీబీఐ…!

వివేకా హత్య కేసును ఎవరూ తేల్చడం లేదు. ఏపీ పోలీసులు తేల్చలేదు. సిట్‌ల మీద సిట్‌లు వేసినా మార్పు రాలేదు. చివరికి హైకోర్టు సీబీఐకి ఇచ్చినా అదే పరిస్థితి. రెండు విడతలుగా సీబీఐ...

HOT NEWS

[X] Close
[X] Close