చంద్రబాబు నాయుడు వెర్సస్ కేసీఆర్ ప్రచారం

ఈరోజు ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు ఇరువురూ గ్రేటర్ ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు నేరుగా ప్రజల మధ్యకి వెళ్లి ప్రచారం చేస్తే, కేసీఆర్ మీడియా ద్వారా ప్రజలకు తను చెప్పదలచుకొన్నది చెప్పారు. సహజంగానే మంచి మాటకారి అయిన కేసీఆర్ ప్రజల మధ్యకు రాకపోయినప్పటికీ, మీడియా ద్వారా తను చెప్పదలచుకొన్నదేదో చాలా చక్కగా చెప్పి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసారు. చంద్రబాబు ప్రసంగంలో తెలంగాణా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించ కూడదనే కొన్ని పరిమితులు విధించుకొన్నందున, ఆయన ప్రసంగం రొటీన్ గా చప్పగా సాగిపోయింది. కానీ ఆయన స్వయంగా ప్రజల మధ్యకు రావడం వలన ప్రజలపై ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అది తెదేపాకు కలిసి రావచ్చును.

చంద్రబాబు నాయుడు యధాప్రకారం తను హైదరాబాద్ అభివృద్ధికి ఏమేమి చేసానో చెప్పుకొని ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తే, కేసీఆర్ కూడా యదా ప్రకారం హైదరాబాద్ కోసం తానేమేమీ చేయబోతున్నానో చెప్పి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. అందుకోసం ఆయన మళ్ళీ చేంతాడంత కొత్త హామీల జాబితాను ప్రకటించారు. అందులో కొత్తగా 200 రైతు బజార్లు, రెండు మూడు రైల్వే స్టేషన్లు, రెండు మూడు బస్ స్టాండులు, శ్మశానాలు, కళ్యాణ మండపాలు, హైదరాబాద్ కి నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఐల్యాండ్ విద్యుత్ వ్యవస్థ, నీటి అవసరాలను తీర్చేందుకు 40 టి.ఎం.సి.ల సామర్ధ్యం గల రిజర్వాయర్ వగైరాలున్నాయి. ఇవికాక పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మూసీ నది, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, కొత్త సచివాలయం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, స్కైవేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు, సైన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి పాత హామీలు ఉండనే ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు నిర్దిష్టంగా ఇటువంటి హామీలు ఏవీ ఈయలేదు కాని తమ కూటమిని గెలిపిస్తే ఇదివరకులాగే హైదరాబాద్ మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందుకు కేసీఆర్ బాగానే చురకలు వేసారని చెప్పవచ్చును. “అమరావతి నిర్మాణానికే నిధులు తెచ్చుకోలేనివాడు హైదరాబాద్ అభివృద్ధికి ఎలాగా తీసుకువస్తాడని” ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు చంద్రబాబు నాయుడుకి బదులు బీజేపీ నేతలే జవాబు చెప్పవలసి ఉంటుంది.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలలోనే హైదరాబాద్ కి నిరంతర విద్యుత్ సరఫరా చేయగలిగామని కేసీఆర్ గొప్పగా చెప్పుకొన్నారు. కానీ అది కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే సాధ్యమయిందనే విషయం అందరికీ తెలుసు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని ఇరువురు ముఖ్యమంత్రులు వాదిస్తున్నారు. కానీ నేడు హైదరాబాద్ ఈ స్థితికి ఎదగగలిగింది అంటే అందుకు కాంగ్రెస్ హయంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన డజన్ల కొద్దీ పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలేనని చెప్పక తప్పదు. కానీ నగరంలో ఐటి మరియు మౌలికవసతుల అభివృద్ధి తెదేపా హయంలోనే జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో వచ్చేసరికి తెలంగాణా ఉద్యమాలు ఉదృతం అవడంతో అభివృద్ధి నిలిచిపోయి, తిరోగమనం కూడా మొదలయింది.

తెలంగాణా ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత వరకు హైదరాబాద్ అభివృద్ధి కోసం పెద్దగా ఏమీ చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్న సమస్యల పరిష్కారానికి కూడా తెరాస ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అందువలన తెరాస అధికారం చేపట్టినప్పుడు హైదరాబాద్ ఏవిధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంది. కాకపోతే హైదరాబాద్ ఇప్పటికే చాలా అభివృద్ధి చెంది ఉంది కనుక ఆ సమస్యలు, లోపాలు బయటపడలేదు.అంతే! అభివృద్ధి ఎందుకు జరగలేదు అంటే మొదటి సంవత్సరమంతా చంద్రబాబుతో, ఆయన ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో కయ్యాలకే సరిపోయింది. చంద్రబాబు నాయుడు గతం చూపించి ఓట్లు అడుగుతుంటే, కేసీఆర్ భవిష్యత్ చూపించి ఓట్లు అడుగుతున్నారు అంతే తేడా.

నిజానికి ఏ పార్టీకయినా ఒక నగరాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని లేదా దేశాన్ని అభివృద్ధి చేసి చూపించే అవకాశం దక్కినప్పుడు దానిని సక్రమంగా వినియోగించుకొని అభివృద్ధి చేసి చూపించగలిగితే చంద్రబాబు నాయుడులాగే ఆ పేరు, గొప్పదనం ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా వారికే దక్కుతుంది. అలాగే చంద్రబాబులాగే ఎప్పుడూ దాని గురించి గర్వంగా చెప్పుకొనే అవకాశం కూడా ఉంటుంది.ఈ సంగతి చంద్రబాబు కూడా గుర్తుంచుకొని తనకి దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిఅభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ గాడినపెట్,టి అమరావతి నిర్మాణం చేసి చూపించగలిగితే రాష్ట్ర చరిత్రలో ఆయన పేరు శాస్వితంగా నిలిచిపోతుంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇదే సూత్రం వర్తిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close