‘నాంది’ హక్కులు.. దిల్ రాజు చేతిలో

తెలుగులో ఓ మంచి సినిమా వ‌స్తే చాలు.. రీమేక్ రైట్స్ ని ఎత్తుకెళ్లిపోవ‌డానికి కాచుకుని కూర్చుంటారు బాలీవుడ్ నిర్మాత‌లు. ఈ యేడాది విడుద‌లైన `క్రాక్‌` సినిమా హిందీ రైట్స్ విష‌యంలో బేర‌సారాలు జ‌రుగుతున్నాయి. తాజాగా… విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన `నాంది` సినిమాపై కూడా వాళ్ల ఫోక‌స్ ప‌డింది. ఇలాంటి క‌థ‌లు.. బాలీవుడ్ లో బాగా వ‌ర్క‌వుట్ అవుతాయి. పైగా వాళ్ల మార్కెట్ కూడా పెద్ద‌ది. మ‌ల్టీప్లెక్స్ వాళ్ల కోసం సినిమా తీసినా… లాభాలు సంపాదించేయొచ్చు.

అయితే.. ఈ సినిమాపై ఏ బాలీవుడ్ నిర్మాత క‌న్నేయ‌క‌ముందే… దిల్ రాజు లాగేసుకున్నారు. `నాంది` సినిమాకి సంబంధించిన అన్ని భాష‌ల రీమేక్ రైట్స్ దిల్ రాజునే ద‌క్కించుకున్నారు. అందుకు గానూ మంచి మొత్త‌మే ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల `నాంది` టీమ్ ని దిల్ రాజు పిల‌పించి మ‌రీ అభినందించారు. అప్పుడే `నాంది` రీమేక్ రైట్స్ గురించిన బేరాలు జ‌రిగిపోయాయ‌ని టాక్‌. `హిట్` సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు దిల్ రాజు. ఆ త‌ర‌వాత `నాంది`నీ ఆయ‌న ప‌ట్టాలెక్కించే ఛాన్సుంది. మిగిలిన భాష‌ల మాటేమో గానీ, బాలీవుడ్ లో ఈ సినిమాని దిల్ రాజు నిర్మించ‌డం ప‌క్కా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close