ఈవారం… మ‌రో అర‌డ‌జ‌ను సినిమాలు

లాక్ డౌన్ త‌ర‌వాత‌… థియేట‌ర్లు మోతెక్కిపోతున్నాయి. వ‌రుస‌గా సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. ప్ర‌తీ వారం రెండు మూడు సినిమాలైనా గ్యారెంటీ. ఈవారం అయితే… ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. అందులో క్రేజ్ ఎన్ని సినిమాల‌కు ఉంద‌న్న సంగ‌తి ప‌క్క‌న పెడితే, థియేట‌ర్లు మాత్రం కొత్త పోస్ట‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడ‌డం ఖాయం.

నితిన్ `చెక్‌`పై అంద‌రి గురీ ఉంది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. సినిమాపై అంచ‌నాలు పెంచుతోంది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమాలంటే ఓ వ‌ర్గం ఎప్ప‌టికీ ఆస‌క్తి చూపిస్తుంటుంది. నితిన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబ‌ట్టి.. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ల‌భించే అవ‌కాశం పుష్క‌లంగా ఉంది. ఈ వార‌మే.. అక్ష‌ర‌, అంగుళీక‌, క్ష‌ణం క్ష‌ణం, నువ్విలా నువ్విలా, ఎం.ఎం.ఓ.ఎఫ్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. వీటిలో అక్ష‌ర‌కే కాస్త క్రేజ్ ఉంద‌నుకోవాలి. జేడీ చక్ర‌వ‌ర్తి న‌టించిన హార‌ర్‌, థ్రిల్ల‌ర్‌… ఎం.ఎం.ఓ.ఎఫ్ కూడా ఈ వారం బ‌రిలో నిలిచింది. ఇందులో ఏ సినిమా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెలుచుకుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close