బాల‌య్య ప్లేసులో నాగ్?!

ఆమ‌ధ్య నాగ‌శౌర్య ద‌గ్గ‌ర‌కు ఓ క‌థ వ‌చ్చింది. యువ ద‌ర్శ‌కుడు చెప్పిన ఆ క‌థ శౌర్యకు బాగా న‌చ్చింది. అయితే అందులో ఓ స్టార్ హీరో కి స‌రిప‌డ పాత్ర కూడా ఉంది. దాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ‌తో చేయిస్తే బాగుంటుంద‌నుకున్నాడు. ఆ ప్ర‌య‌త్నాలూ జ‌రిగాయి. అప్ప‌ట్లో బాల‌య్య కూడా ఈ సినిమా చేయ‌డానికి అంగీకారం తెలిపాడు. దాంతో బాల‌కృష్ణ – నాగ‌శౌర్య మ‌ల్టీస్టార‌ర్ వ‌చ్చేస్తుంద‌ని అంతా అనుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు బాల‌కృష్ణ చేయ‌డం లేద‌ని తెలిసింది. ఈమ‌ధ్యే.. గోపీచంద్ మ‌లినేని క‌థ‌కు బాల‌య్య ఓకే చెప్పాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. బాల‌య్య – బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో సినిమా పూర్త‌యిన వెంట‌నే, గోపీచంద్ మ‌లినేని సినిమా ప‌ట్టాలెక్కుతుంది. దాంతో నాగ‌శౌర్య సినిమా చేసే స‌మ‌యం లేక‌పోయింది బాల‌య్య‌కు. అందుకే.. ఈ విష‌య‌మే సున్నితంగా చెప్పి, ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడ‌ట బాల‌య్య‌. ఆ పాత్ర ఇప్పుడు నాగార్జున‌తో చేయిస్తే ఎలా ఉంటుందా? అని భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ క‌థ ప‌ట్టుకుని నాగ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. నాగ్ మ‌ల్టీస్టార‌ర్లంటే ఆస‌క్తి చూపిస్తుంటాడు. కాబ‌ట్టి… త‌న‌నుంచి ఎలాంటి అభ్యంత‌రాలూ లేక‌పోవొచ్చు. కాక‌పోతే.. నాగ్ ద‌గ్గ‌ర కూడా కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తే ప్ర‌మాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“మా” ఎన్నికలకు వైసీపీ పరిశీలకుడిగా రౌడీషీటర్ వచ్చారట !

"మా" ఎన్నికలను పర్యవేక్షించి మంచు విష్ణును గెలిపించేందుకు వైసీపీ తరపున ఎన్నికల పరిశీలకుడిగా ఓ నొటొరియస్ క్రిమినల్‌ను పంపినట్లుగా ప్రకాష్ రాజ్ కొత్తగా ఆరోపణలు చేశాయి. ఎన్నికలు జరుగుతున్నసమయంలో.. కౌంటింగ్‌లో ఫోన్‌లో...

విమర్శలు ప్రజాస్వామ్యసహితంగా ఉండాలి : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో బూతులు, నీచమైన భాషతో ట్వీట్లు పెట్టే వారిలో నెంబర్ వన్ స్థానంలో ఉండే విజయసాయిరెడ్డి కూడా .. రాజకీయ విమర్శలు ఎలా ఉండాలో పాఠాలు చెబుతున్నారు. విశాఖలో వైసీపీ నేతలు ఏర్పాటు...

‘గామి’ కి బన్నీ మాట సాయం

గామి.. ఇప్పటి సినిమా కాదు. నాలుగేళ్ల క్రితం గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు దర్శకుడు కాగిత విద్యాధర్‌. తను నమ్ముకున్న కాన్సెప్ట్ ఎలాగైనా ప్రేక్షకులకు చూపించాలని...

మన వ్యాక్సిన్ల గురించే ప్రపంచం ముచ్చట : మోడీ

దేశంలో నిన్నటికి వంద కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను ప్రజలకు పంపిణీ చేశారు. దీనికి గుర్తుగా నిన్నటి నుంచే ఓ గీతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజున ఉదయమే మోడీ తెర మీదకు...

HOT NEWS

[X] Close
[X] Close