దిల్ రాజు కాంపౌండ్‌.. ఇచ్చ‌ట రీషూట్లు చేయ‌బ‌డును!

‘రీషూట్లు త‌ప్పు కాదు.. అది మేకింగ్‌లో ఓ పార్ట్’ అని చెప్పుకొంటుంటారు ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు. కానీ… ఎక్కువ రీషూట్లు జ‌రుపుకొన్న సినిమా ఒక్క‌టి కూడా ఆడిన దాఖ‌లాలు లేవు. రీషూట్లు ఎక్కువ‌య్యే కొద్దీ బ‌డ్జెట్ పెరిగిపోతుంది. ద‌ర్శ‌కుడిలో క్లారిటీ లేక‌పోవ‌డం, నిర్మాత‌ల‌కు సినిమాపై న‌మ్మ‌కం కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ రీషూట్ల తంతు మొద‌ల‌వుతోంది. ఈమ‌ధ్య దిల్ రాజు కాంపౌండ్ లో కూడా రీషూట్ల హ‌డావుడి కాస్త ఎక్కువ క‌నిపిస్తోంది. ‘ది ఫ్యామిలీ స్టార్‌’లో కొన్ని స‌న్నివేశాల్ని రీషూట్ చేసిన‌ట్టు అప్ప‌ట్లో చెప్పుకొన్నారు. శంక‌ర్ ‘గేమ్ ఛేంజ‌ర్‌’దీ ఇదే ప‌రిస్థితి. ఇటీవ‌ల విడుద‌లైన ‘ల‌వ్ మి’ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయ్యింది. అయితే.. దిల్ రాజు కొన్ని మార్పులూ, చేర్పులూ సూచించిన పిద‌ప‌… సినిమా రీషూట్ల‌కు వెళ్లింది. అయితే ఎన్ని ద‌ఫాలు తీసిందే తీసినా.. రిజ‌ల్ట్ రాలేదు.

దిల్ రాజు కాంపౌండ్లోనే తెర‌కెక్కుతున్న మ‌రో సినిమా.. ‘ఆకాశం దాటి వ‌స్తావా’. కొరియోగ్రాఫ‌ర్ య‌శ్ ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇది కూడా ఎప్ప‌టి సినిమానో. ఇంకా విడుద‌ల‌కు నోచుకోలేదు. దానికి కార‌ణం… రీషూట్ల మీద రీషూట్లు జ‌రుపుకోవ‌డ‌మే. షూటింగ్ పూర్త‌య్యాక దిల్ రాజు రంగంలోకి దిగ‌డం, ఆ త‌ర‌వాత రిపేర్లు మొద‌లెట్ట‌డంతో, రీషూట్ల ప‌ర్వానికి శ్రీ‌కారం చుట్టుకొంది. ఈ సినిమా ఎప్పుడు పూర్త‌వుతుందో, ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. పోనీ రీషూట్ల త‌ర‌వాతైనా సినిమాల జాతకాలు మారాయా అంటే అదీ లేదు. ఇది వ‌ర‌కు దిల్ రాజు వ్య‌వ‌హారం వేరుగా ఉండేది. స్క్రిప్టు ద‌శ‌లోనే దాన్ని పోస్ట్ మార్ట‌మ్ చేసేసేవారు. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూడా మార్పులూ చేర్పులూ జ‌రిగేవి. అందుకే రీషూట్ల తంతు ఉండేది కాదు. ఇప్పుడు దిల్ రాజు చేతిలో సినిమాలు ఎక్కువైపోవ‌డం వ‌ల్ల‌, కొన్ని బాధ్య‌త‌లు కొంద‌రిపై వ‌దిలేస్తున్నారు. లూజ్ హ్యాండ్స్ వ‌ల్ల‌… అనుకొన్న సినిమాలు అనుకొన్న‌ట్టు రావ‌డం లేదు. అందుకే ఇక‌పై త‌న సినిమాల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని దిల్ రాజు డిసైడ్ అయిపోయార‌ని టాక్. ఈమాత్రం అప్ర‌మ‌త్తం అవ్వ‌కపోతే.. దిల్ రాజు బ్యాన‌ర్ ప్ర‌తిష్ట దెబ్బ‌తింటుంది మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శిద్దా రాఘవరావు వైసీపీకి గుడ్ బై !

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన 2014-19 వరకు ఐదేళ్ల పాటు టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత కొన్నాళ్లు పార్టీలోనే ఉన్నా...
video

మిస్టర్ బచ్చన్ షో రీల్: రైడ్ కి ఓ కొత్త లేయర్

https://www.youtube.com/watch?v=FgVYeHnc0Ak హరీష్ శంకర్ లో మంచి మాస్ టచ్ వుంది. ఆయన ఏ కథ చెప్పినా మాస్ అప్పీలింగ్ తో తయారు చేస్తుంటారు. రిమేకులు చేయడంలో కూడా ఆయనకి సెపరేట్ స్టయిల్ వుంది. దబాంగ్...

హోంమంత్రి అనిత … వనితలా కాదు !

ఏపీ హోంత్రులుగా దళిత మహిళలే ఉంటున్నారు. జగన్ రెడ్డి హయాంలో ఇద్దరు దళిత హోంమంత్రులు ఉన్నారు. ఒకరు మేకతోటి సుచరిత, మరొకరు వనిత. అయితే తాము హోంమంత్రులమన్న సంగతి వీరిద్దరికి కూడా...

జగన్ అహానికి ప్రజల పరిహారం పోలవరం !

పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ జీవనాడి. కేంద్రం వంద శాతం నిధులతో నిర్మించుకోమని జాతీయ హోదా ఇస్తే కళ్లు మూసుకుని నిర్మాణాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును జగన్ రెడ్డి తన అహానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close