బడా నిర్మాత అనే మాట కన్నా దిల్ రాజు విషయంలో బడా డిస్ట్రిబ్యూటర్ అనాల్సి వస్తుంది.. సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిర్మాత స్థాయికి వెళ్లగలిగాడు దిల్ రాజు. అయితే ఇదంతా ఒక్కరోజులో జరిగిందేమి కాదు.. ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే దిల్ రాజు ఫిక్స్ అయ్యాడంటే ఆ సినిమా దర్శక నిర్మాతలతో ముందే మాట్లాడి ఖర్చీఫ్ వేసేస్తాడు.
ప్రస్తుతం ఈ సమ్మర్ లో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండగా వాటిలో ఏది దిల్ రాజు రిలీజ్ చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా మంచి క్రేజ్ ఉన్న దిల్ రాజు వేలకొద్ది థియేటర్స్ గ్రిప్ లో పెట్టుకున్నాడు. చాలా చోట్ల అతనికి సొంతం థియేటర్స్ కూడా ఉన్నాయి. మరి ఈ సమ్మర్ హీరో సినిమాలను ఎందుకు వదిలేశాడో తెలియట్లేదు. ఓ వైపు ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్, మరో రెండు వారాల్లో అంటే ఏప్రిల్ 22న సరైనోడు వస్తుండగా వీటిలో ఏది దిల్ రాజు రిలీజ్ చేయకపోవడం విశేషం.
ఒకవేళ దిల్ రాజు ఆఫర్ చేసినా ఇవ్వలేదా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా తెలియదు కాని పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా, అల్లు అర్జున్ సరైనోడు సినిమా దిల్ రాజు మిస్ చేశాడని తెలుస్తుంది. ఇక రాబోతున్న అ..ఆ, బ్రహ్మోత్సవం కూడా దిల్ రాజు కంటే ముందే అభిషేక్ పిక్చర్స్ కొనేశారని టాక్. అందుకే తమిళ స్టార్ హీరో విజయ్ తెరి సినిమాను తెలుగులో పోలీసోడుగా గ్రాండ్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. అసలే విజయ్ కు తెలుగులో అంత మార్కెట్ ఏమి లేదు.. మరి దిల్ రాజు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.