‘ఓజీ’తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరపురాని సినిమా ఇచ్చాడు సుజిత్. పవన్ కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ‘ఓజీ’ నిలిచిపోతుంది. ఓజస్ గంభీర పాత్రలో పవన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్, క్యారెక్టరైజేషన్.. ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత సూపర్ కిక్ ఇచ్చాయి.
ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని టైటిల్ కార్డ్స్ లో వేశారు. కానీ అది జరుగుతుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. కారణం.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొత్త సినిమాలు ఒప్పుకునే పరిస్థితిలో లేకపోవడం. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టులపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఓజీ 2’ పనులు ఇప్పటికిప్పుడు మొదలయ్యే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
సుజిత్ ప్రస్తుతం నాని కోసం ఓ కథను సిద్ధం చేశాడు. అది డార్క్ క్రైమ్ కామెడీ జానర్లో ఉంటుంది. యాక్షన్, స్టైలిష్ మేకింగ్ లో సుజిత్ మార్క్ స్పష్టంగా కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. నాని ప్రస్తుతం పారడైజ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తవగానే, సుజిత్ – నాని కాంబో ప్రాజెక్ట్ సెట్స్ కి వెళుతోంది.