‘బాహుబ‌లి’ని చూసి ‘సైరా’ మొద‌లెట్ట‌లేదు: సురేంద‌ర్‌రెడ్డి

సైరా ముందున్న పెద్ద స‌వాల్‌.. బాహుబ‌లి. సైరా ఆ రికార్డుల్ని బ‌ద్ద‌లు కొడుతుందా? లేదా? అని చిరంజీవి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్ట‌డం అంత ఈజీ కాదు. ఈ విష‌యం సైరా బృందానికీ తెలుసు. అందుకే… రికార్డుల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు చిత్ర‌బృందం ఆచితూచి స్పందిస్తోంది.

సైరా ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ఐమాక్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా బాహుబ‌లి రికార్డుల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. బాహుబ‌లి రికార్డుల్ని సైరా బ‌ద్ద‌లు కొండుతుంద‌నుకుంటున్నారా? అనే ప్ర‌శ్న‌కు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కాస్త తెలివిగానే సమాధానం చెప్పాడు. “బాహుబ‌లిని చూసి ఈసినిమా మొద‌లెట్ట‌లేదు. మా నాన్న‌గారు చేసిన 151 సినిమాల్లో నా సినిమానెంబ‌ర్ వ‌న్ గా ఉండాలి అనే చ‌ర‌ణ్ సంక‌ల్ప‌బ‌లంతో ఈసినిమా మొద‌లైంది. ప‌దేళ్ల క్రితం తీయాల్సిన సినిమా ఇది. అప్పుడు తీసుంటే 1500 కోట్ల బ‌డ్జెట్‌ అయ్యేదేమో. అంత పెట్టినా ఈ క్వాలిటీ వ‌చ్చేది కాదు. ఇప్పుడు సాంకేతిక నైపుణ్యం పెర‌గ‌డం వ‌ల్ల మా ప‌ని సుల‌భం అయ్యింది” అని చెప్పుకొచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిరెడ్డి నీళ్లు నమిలిన ప్రశ్న..!

రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం...

లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో...

ఆర్ఆర్ఆర్‌పై ఎలా వేటేయాలో కూడా స్పీకర్‌కు చెప్పిన వైసీపీ బృందం..!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను...

వ‌ర్మ టీమ్‌లో ‘క‌రోనా’ భ‌యం

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ... సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవి ఎలాంటి సినిమాలు? ఎవ‌రికి న‌చ్చాయి? అనేది ప‌క్క‌న పెడితే - క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లోనూ ప‌నైతే చేయ‌గ‌లిగాడు. వ‌ర్మ‌కి...

HOT NEWS

[X] Close
[X] Close